Padma Vibhushan Awards : ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఎంతమంది స్టార్స్ పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారంటే?

Padma Vibhushan Awards : రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పలువురు సినీ ప్రముఖులకు పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మే 9న మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ అవార్డులను ఇచ్చి సత్కరించారు. మరి ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో పద్మ విభూషణ్ అందుకున్న నటీనటులు ఎవరు అన్న విషయంపై ఓ లుక్కేద్దాం.

1. అక్కినేని నాగేశ్వరరావు

సినిమా ఇండస్ట్రీలో దేశంలోనే రెండవ అత్యున్నర పౌర పురస్కారమైన అవార్డుగా పరిగణించే పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఈ దివంగత నట దిగ్గజం 2011లో పద్మ విభూషణ్ అందుకున్నారు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 67 ఏళ్ల సినీ కెరీర్ లో 150 కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నారు. పద్మ విభూషణ్ తో పాటు ఆయనను మరెన్నో విలువైన అవార్డులు వరించాయి.

2. అమితాబ్ బచ్చన్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ నటుల్లో ఒకరైన అమితాబ్ బచ్చన్ పద్మ విభూషణ్ అందుకున్న హీరోలలో రెండవ స్థానంలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న అమితాబ్ 2017 అత్యున్నత గౌరవం అయినా పద్మ విభూషణ్ ను అందుకున్నారు. అయితే ఆయన కుటుంబంలో ఏకంగా ఏడు పద్మ అవార్డులు ఉండడం విశేషం. భారతీయ సినీ పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన 80 ఏళ్లు దాటాక కూడా ఇంకా జోష్ తో సినిమాలు చేస్తున్నారు.

- Advertisement -

3. రజనీకాంత్

బిగ్ బి అమితాబ్ బచ్చన్ పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న తదుపరి ఏడాదే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. రజినీని 2016లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్రం.

4. వైజయంతి మాల

2024లో పద్మ అవార్డులు పొందిన 132 మంది లిస్ట్ లో ప్రముఖ కోలీవుడ్ నటి వైజయంతి మాల కూడా ఉన్నారు. ఆమె సినిమా పరిశ్రమకు అందించిన విశిష్ట సేవలకు గాను రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ను ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 16వ ఏటనే కోలీవుడ్ లోకి అడుగు పెట్టిన వైజయంతి మాల ఎన్నో సినిమాల్లో నటించి ఇండియాలోనే ఫస్ట్ మహిళా సూపర్ స్టార్ గా బిరుదును సొంతం చేసుకుంది. ఆమె నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా.

5. మెగాస్టార్ చిరంజీవి

2024లో పద్మ విభూషణ్ అందుకున్న వారి లిస్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న రెండవ టాలీవుడ్ స్టార్ గా రికార్డును క్రియేట్ చేశారు.

ఇండస్ట్రీలో ఇప్పటిదాకా పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న ప్రముఖులు

  1. గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి -1975
  2. దర్శకుడు సత్యజిత్ రాయ్ – 1976
  3. సితారిస్ట్ రవిశంకర్ 1981
  4. బిర్జూ మహారాజ్ 1986
  5. గాయకుడు ఎం బాలమురళీకృష్ణను 1991
  6. దర్శకుడు వి శాంతారాంను 1992
  7. గాయకులు లతా మంగేష్కర్, డీకే పట్టమ్మాళ్, భీంసేన్ జోషి – 1999
  8. దిలీప్ కుమార్ -2014
  9. గాయకుడు కేజే ఏసుదాసు 2017
  10. సంగీత దర్శకుడు ఇళయరాజా 2018
  11. హృషికేష్ ముఖర్జీ 2001
  12. ఆడూర్ గోపాల కృష్ణన్ 2006
  13. నృత్య దర్శకుడు జోహ్రా ముంతాజ్ సెహగల్ 2010
  14. గాయకుడు భూపేన్ హజారికా 2012
  15. గాన గంధర్వుడు ఎస్పీబీ 2021

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు