Mahesh Babu: షాకింగ్…. రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన మహేష్ ?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్లు ఉన్న ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా కాదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. తన తండ్రి కారణంగానే సినిమాలోకి వచ్చిన మహేష్ బాబు… తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 50 సంవత్సరాల వరకు ఉన్న మహేష్ బాబు ఇప్పటికీ యంగ్ హీరో గానే కనిపిస్తాడు.

ఇక ఇటీవల గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ గుంటూరు కారం సినిమా…. అదిరిపోయే హిట్ అందుకుంది. అయితే తాజాగా మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కెరీర్ లో ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేసాడట మహేష్ బాబు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జనాలు.

ప్రిన్స్ మహేష్ బాబు మరియు గుణశేఖర్ దర్శకత్వంలో సైనికుడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ టచ్ ఉన్న ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయి అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో ఈ సినిమా మేకర్స్ కు భారీ నష్టాలు వచ్చాయట. అయితే వారి బాధ చూడలేక మహేష్ బాబు తాను తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేసాడట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు