Rayan Movie: ధనుష్ ‘రాయన్‌’..రిలీజ్ డేట్ ను లాక్ !

Rayan Movie: సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తే మరికొంతమంది… సొంత కాళ్లపై నిలబడతారు. అలా సొంత కాళ్లపై నిలదొక్కుకొని ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ధనుష్ ఒకరు. తమిళ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రజనీకాంత్ అల్లుడిగా చాలామందికి పరిచయం ఉన్నప్పటికీ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ధనుష్. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంత రేంజ్ మైంటైన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ తమిళ హీరో ధనుష్ ఓ అదిరిపోయే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పోరే రాయన్. ఈ సినిమాలో సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాసు జయరాం లాంటి కీలక నటులు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఎవరు చేయని క్యారెక్టర్ ఈ సినిమాలో ధనుష్ చేస్తున్నారు. మటన్ షాప్ ఓనర్గా ధనుష్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం అలాగే కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా జూన్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు