Kajal Agarwal: మా నాన్న వల్ల ఎంతో ఏడ్చాను.. కానీ..?

Kajal Agarwal.. ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించి.. ఆ తర్వాత తాను ప్రేమించిన తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది . వివాహం అనంతరం ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె మళ్లీ సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడానికి చాలా కసరత్తులు చేసింది. అందులో భాగంగానే మళ్లీ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత తన బాడీలో మార్పులు రావడంతో.. ఆ బాడీని మళ్లీ షేప్ లోకి తీసుకురావడం కోసం చాలా సమయం జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ.. ఇప్పుడు దర్శకులకంట పడే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె నటించిన చిత్రం సత్యభామ .. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటోంది.

Kajal Agarwal: I cried a lot because of my father.. but..?
Kajal Agarwal: I cried a lot because of my father.. but..?

ఆలీ షోలో కాజల్..

ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి వచ్చిన కాజల్ అగర్వాల్ పలు విషయాలను పంచుకోవడమే కాదు తన తండ్రి వల్ల బాగా ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆలీతో కాజల్ పలు విషయాల గురించి మాట్లాడుతూ ఉండగా.. మధ్యలో అలీ మాట్లాడుతూ.. మీకు మొదటి సినిమా ఆఫర్ ఎలా వచ్చింది.. ఆడిషన్స్ లో ఏం చేశారు అని అడగగా.. ఆమె ఈ విషయాన్ని సరదాగా చెప్పుకొచ్చింది..

మా నాన్న వాళ్ళ బాగా ఏడ్చాను…

తేజ సినిమాలో తనకు ఎలా అవకాశం లభించిందో చెప్పుకొచ్చింది.. దర్శకుడు తేజ నా ఫోటో చూసి ఆడిషన్స్ కి పిలిచారు ..ఆడిషన్స్ లో నన్ను ఏం అడుగుతారా? అని నేను ఎంతో ఎదురు చూశాను.. అయితే ఆయన నన్ను కేవలం ఏడవమని చెప్పారు.. ఫీలింగ్ లేకుండా ఎలా ఏడవాలి అని, నాలో నేను మదనపడ్డాను.. అప్పుడు మా నాన్న నా వద్దకు వచ్చి నిజంగా నేను ఏడ్చే ఒక విషయాన్ని చెప్పారు.. అప్పుడు నేను.. నాకు తెలియకుండానే నాకు ఏడుపు వచ్చేసింది.. బాగా ఏడ్చాను. ఇక అది చూసి వెంటనే తేజ గారు నాకు లక్ష్మీ కళ్యాణం సినిమాలో అవకాశం ఇచ్చారు అంటూ సరదాగా చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. ముఖ్యంగా హీరోయిన్లను తేజ ఎంపిక చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుందని.. ఎవరు ఊహించిన విధంగా ఆయన హీరోయిన్లను ఎంపిక చేసుకుంటూ ఉంటారని చెప్పుకొచ్చింది..

- Advertisement -

ఆ ఏడుపే ఇప్పుడు ఇంత సక్సెస్ ను ఇచ్చింది..

ఇకపోతే లక్ష్మీ కళ్యాణం సినిమాలో కాజల్ క్యారెక్టర్ ఎక్కువసేపు ఏడుస్తూనే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఆ క్యారెక్టర్ కి ఏడవడమే ముఖ్యం.. కాబట్టి తేజ అలా ఆదేశం చేసి ఉంటారని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇందులో ఈమెకు అవకాశం రావడానికి కారణం ఒకరకంగా ఈమె తండ్రి అని చెప్పాలి. నాడు తన తండ్రి తనకు ఏం చెప్పాడో తెలియదు కానీ అది తలుచుకొని ఆమె బాగా ఏడవడం వల్లే ఈమెకు ఈ సినిమాలో అవకాశము వచ్చి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. ఏది ఏమైనా తన తండ్రి చేసిన పని కాజల్ కు బాగా కలిసి వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు