Megastar Chiranjeevi: రాజకీయాలకి అతీతంగా ఉండాలి అనుకుంటున్నా

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ను ఒక రాజులా శాసిస్తున్నాడు అని చెప్పొచ్చు. కేవలం ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని మెగాస్టార్ చిరంజీవి ను చూస్తే అర్థమవుతుంది. ప్రతి జోనర్ ని టచ్ చేసి అద్భుతమైన అభిమానులను సాధించుకున్నారు మెగాస్టార్. ఇకపోతే రీసెంట్ గా మెగాస్టార్ కి పద్మభూషణ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే ఢిల్లీ వెళ్లి అవార్డును అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ మళ్ళీ తిరిగి వచ్చి తరుణంలో ఎయిర్పోర్టు లో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పలు విషయాలు స్పందించారు మెగాస్టార్ చిరంజీవి.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో చిరంజీవి కి కూడా బ్రహ్మరథం పట్టి మంచి రిజల్ట్ ను కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే కొన్ని రోజులు తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పట్నుంచి రాజకీయాల్లో ఆయన మెల్లమెల్లగా తప్పుకోవడం జరిగింది.

ప్రస్తుతం రాజకీయాలకు చాలా దూరంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. కానీ మెగాస్టార్ తమ్ముడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2014లో స్థాపించిన ఈ పార్టీ ఎప్పటికీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. రిజల్ట్ తేడా కొట్టిన కూడా గత పది ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఈ పార్టీని నడిపిస్తున్నారు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి పలువురి టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. చాలామంది చిన్న చిన్న నటులు సైతం పవన్ కళ్యాణ్ గెలవాలని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని చాలామంది ట్వీట్లు కూడా వేస్తూ తమ మద్దతును తెలియజేశారు. అలానే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వీడియోను రిలీజ్ చేసి సపోర్ట్ చేశారు.

ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ. రాజకీయాలకు నేను అతీతంగా ఉండాలి అనుకుంటున్నాను. నన్ను పిఠాపురం రమ్మని పవన్ కోరలేదు. ఎప్పుడు రాజకీయాల్లో నాకు ఇలా ఉండండి అని పవన్ కళ్యాణ్ చెప్పలేదు నా కంఫర్ట్ నాకు వదిలేస్తాడు అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మే 13న జరగనున్నాయి. ఇంకా ఎంతమంది సెలబ్రిటీస్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తారు వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు