Prashanth Neel : ఒకటితో ఆపేలా లేడు

ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే బోయపాటి సినిమా. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు ప్యూర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ సినిమాల్ని తీసేవాడు బోయపాటి. తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా పీక్ కి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. ఎలివేషన్ ఫైట్స్ ఇవన్నీ ఒక కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి అని చెప్పొచ్చు. చాలామంది కమర్షియల్ సినిమాను పీక్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు ఉన్నారు. అందులో ప్రశాంత్ నీల్ ఒకడు.

ఒకప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అంటే మనకు చాలా చిన్న చూపుగా ఉండేది. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “కే జి ఎఫ్” సినిమా చూసిన తర్వాత ఆ ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. ఇండస్ట్రీలో జాతకం మారిపోవడానికి ఒక శుక్రవారం చాలు అని చెబుతూ అంటారు. సరిగ్గా అదే జరిగింది ప్రశాంత్ నీల్ కి. ఎందుకంటే కేజీఎఫ్ సినిమా వచ్చేంతవరకు కూడా పెద్దగా అంచనాలు లేవు. ఒకసారి కేజిఎఫ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలు అమాంతం ఆకాశాన్ని అంటుకున్నాయి.

“కే జి ఎఫ్” సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. కే జి ఎఫ్ సినిమాలోని హీరో ఎలివేషన్, ఫైట్స్, డైలాగ్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్ కి క్రేజీగా అనిపించాయి. అందుకని ఈ సినిమా అద్భుతంగా ఆడి బీభత్సమైన డబ్బులను కలెక్ట్ చేసింది. ఇదే సినిమాకి సీక్వెల్ గా కేజిఎఫ్ 2 సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా స్థాయిని మించి అద్భుతంగా ఆడింది. ఇక్కడితో ప్రశాంత్ నీల్ అమాంతం ఆకాశానికి ఎక్కేసాడు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ ను చూసే విధానం ఈ సినిమా తర్వాత మారిపోయింది.

- Advertisement -

కే జి ఎఫ్ 2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన చిత్రం సలార్. సలార్ సినిమా సృష్టించిన ప్రకంపలను గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ లో హిట్ లేదు. ఈ తరుణంలో సలార్ సినిమా వచ్చి కోట్లు కొల్లగొట్టి అభిమానులకు మర్చిపోలేని కిక్కిచ్చిందని చెప్పొచ్చు. ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకొని మంచి హిట్ కొట్టాడు ప్రశాంత్ నీల్.

ఇకపోతే ప్రశాంత్ ని నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్,సలార్ సినిమాలకు సీక్వెల్ ఉంటుందని ఇదివరకే ప్రకటించాడు. ఇకపోతే కేజీఎఫ్ కి సీక్వెల్ గా కేజిఎఫ్ 2 కూడా తీసేసాడు. సలార్ కి సీక్వెల్ ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి కూడా ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని తెలుస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే. ఒక విషయం చెప్పడానికి కేవలం మూడు గంటలు మాత్రమే సరిపోదు అని కాకుండా ఆయా పాత్రలతో చాలా చెప్పొచ్చు అనే స్కోప్ ఉండేటట్లు కథను రాశాడు ప్రశాంత్ నీల్. అందుకే ఒకటితో ఆగకుండా రెండు పార్ట్లు ప్లాన్ చేశాడు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న “దేవర” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు