NTR: ఎన్ని సినిమాల్లో ఎన్టీఆర్ పాటలు పాడారో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈయన జపాన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు.. ఈ తరంలో ఎన్టీఆర్ లా డైలాగ్ చెప్పే నటులు మరొకరు లేరంటే అది అతిశయోక్తి కాదు.. అలా తన నటనతో, డాన్స్లతో, డైలాగ్ డెలివరీతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఎంత కష్టమైన డైలాగ్ నైనా సరే ఇట్టే ఒక్క టేక్ లోనే చెప్పే నటుడిగా పేరు దక్కించుకున్నారు..

ఇకపోతే ఎన్టీఆర్ నటుడి గానే చాలామందికి తెలుసు.. కానీ ఆయన సింగర్ కూడా.. కొన్ని సినిమాలలో ప్రత్యేకంగా ఆయనే తన వాయిస్ ని వినిపించారు కూడా.. అలా మొత్తం ఎన్ని సినిమాలలో పాటలు పాడారో చాలామందికి తెలియదని చెప్పాలి. ఎన్టీఆర్ ఇప్పటివరకు ఆరు సినిమాలలో తన వాయిస్ ని అందించారు .. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాలో ” ఓలమ్మి తిక్కరేగిందా” అనే పాటను ఎన్టీఆర్ స్వయంగా పాడారు.. ఈ సినిమాకి ఆస్కార్ గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు.. ఆ తర్వాత మణిశర్మ సంగీతం అందించిన కంత్రి సినిమాలో టైటిల్ పాట కూడా ఎన్టీఆర్ పాడారు..

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చేత ఒక పాట పాడించారు.. ఆ పాట సూపర్ హిట్ కూడా అయింది.. ఇక వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే తమన్ సంగీత సారథ్యంలో రభస సినిమాలో కూడా అచ్చ తెలుగు ఆడపిల్లలా అనే పాటను పాడారు ఎన్టీఆర్. అంతేకాదు దేవిశ్రీప్రసాద్ మరోసారి సంగీతం అందించిన నాన్నకు ప్రేమతో సినిమాలో ఫాలో ఫాలో అనే పాటను కూడా పాడారు..

- Advertisement -

ఎన్టీఆర్ ఒక్క తెలుగులోనే కాదు కన్నడలో కూడా పాడారు.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలో కూడా ఎన్టీఆర్ పాట పాడి అభిమానులను ఆకట్టుకున్నారు.. అలా తెలుగు, కన్నడలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది.. అంతేకాదు దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కూడా.. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 సినిమా చేస్తున్నారు ..త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు