Thaman : ఆ ఘంటసాల వేరు.. ఈ ఘంటసాల వేరు..

Thaman

టాలీవుడ్ లో ప్రస్తుత సంగీత దర్శకుల్లో టాప్ రేంజ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న థమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థమన్ తాను చేసిన సినిమాలతో తెలుగు నాటే కాదు, ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ని సంపాదించాడు. ఒక్క తెలుగు లోనే కాకుండా సౌత్ భాషలన్నింటిలోనూ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇయర్ గుంటూరు కారం తో మంచి బోణి కొట్టిన థమన్ త్వరలోనే గేమ్ ఛేంజర్, ఓజి సినిమాలతో రానున్నాడు.

ఇదిలా ఉండగా థమన్ చాలా పూర్తి పేరు చాలా తక్కువ మందికే తెలుసు. థమన్ గురించి బాగా తెలిసిన వారికి ఆయన పూర్తి పేరు ‘ఘంటసాల సాయి శ్రీనివాస్ శివకుమార్’ అని తెలుసు. అయితే ఘంటసాల అనే సరికి చాలా మంది ఆడియన్స్ లెజెండరి గాయకుడు ఘంటసాల వారసుడు అని అనుకున్నారు. అలాగే కొన్నేళ్ల వరకు ఈ వార్త కంటిన్యూ అయింది. కానీ థమన్ ఓ ఇంటర్వ్యూ లో దీనికి సమాధానమిస్తూ పులిస్టాప్ పెట్టాడు. ఘంటసాల కి నేను మనవడిని. ఆయన మా తాతగారు అన్నాడు. అయితే ప్రేక్షకులు అనుకున్నట్టు సింగర్ ఘంటసాల మా తాత కాదు.

- Advertisement -

గాయకుడు ఘంటసాల వేరు. ఆయన పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు, మా తాత పూర్తి పేరు “ఘంటసాల బలరామయ్య”. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ లో తొలితరం ప్రముఖ దర్శక నిర్మాతల్లో ఒకరు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన ‘సీతారామజననం’ చిత్రంతోనే అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే ఎక్కువ కాలం సినిమాలు నిర్మించలేదు. కొన్నేళ్ల తర్వాత ఆపేసారు.

అయితే థమన్ తండ్రి శివ కుమార్ కి నిర్మాణ రంగంలో పెద్దగా ఇష్టం లేక వదిలేసాడు. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర డ్రమ్మర్ గా చేరి 700 సినిమాలకు డ్రమ్మర్ గా పనిచేసారు. ఈ క్రమంలో తన తండ్రితో పాటు, తనకు కూడా మ్యూజిక్ పై ఆసక్తి పెరిగి సినిమాల్లోకి వచ్చానని అన్నాడు థమన్. అంతే గాని ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి తమకి పేరు వల్ల ఎలాంటి సంబంధం లేదని థమన్ క్లారిటీ ఇచ్చాడు.
Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు