Kalki 2898 AD: దీపికకు భారీ రెమ్యునరేషన్‌..ఇదే తొలిసారి!

Kalki 2898 AD

టాలీవుడ్‌ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ “కల్కి 2898AD”. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 9వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కానీ ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతోంది. రెండు పార్టులుగా వస్తున్న “కల్కి 2898AD” సినిమాలో మొదటి భాగాన్ని ఎలా ముగించాలనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికోసం మూడు రకాల క్లైమాక్స్ లు డిజైన్ చేసి పెట్టుకున్నారట.

ఆ మూడింటిలో ఏది ఫైనల్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ప్రభాస్ సినిమాలకి ఎక్కువగా క్లైమాక్స్ విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయట. “బాహుబలి” సినిమా సమయంలో కూడా పార్ట్ వన్ ముగింపు విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడట. డిసెంబర్ లో వచ్చిన “సలార్” సినిమా పార్ట్ వన్ క్లైమాక్స్ విషయంలో రెండు, మూడు రకాల క్లైమాక్స్ లు రాసుకున్నారట. ప్రశాంత్ నీల్ ఇప్పుడు “కల్కి 2898AD” విషయంలో కూడా పార్ట్ వన్ కు సంబంధించి క్లైమాక్స్ కు సంబంధించి కాస్త గందరగోళం నెలకొంది.

కమలహాసన్ విలన్ పాత్ర పరిచయంతో కల్కి పార్ట్ వన్ ముగుస్తుందని, అదే సమయంలో పురాణాలకి ముడిపెడుతూ క్లైమాక్స్ లో ట్విస్ట్ లు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక “కల్కి 2898AD” చిత్రంలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనే నటిస్తుంది. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. లేడీ వారియర్ గెటప్ లో ఆమె అద్భుతంగా ఉన్నారు. కాగా “కల్కి 2898AD” చిత్రానికి దీపికా పదుకొనే భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారట. రూ. 20 కోట్లు ఆమె డిమాండ్ చేశారని సమాచారం. “కల్కి 2898AD” నిర్మాతలు దీపికా పదుకొనే అడిగిన మొత్తం ఇచ్చారట. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా దీపికా పదుకొనే ఉన్నారు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు