Lal Salaam: రజినీకాంత్ భార్యగా నటించింది ఎవరో గుర్తుపట్టారా..?

Lal Salaam

సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధి పాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం లాల్ సలాం.. ఫిబ్రవరి 9వ తేదీన తమిళ్, తెలుగు భాషలలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ , జీవిత రాజశేఖర్ పలువురు కీలకపాత్రలు పోషించారు. పూర్తిగా తమిళ్ ఫ్లేవర్ తో ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా తమిళ్లో మాత్రం కేవలం రజినీకాంత్ మేనియాతోనే నడిపిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.. ఇందులో ముంబై డాన్ మొయినుద్దీన్ భాయ్ గా కనిపించారు రజనీకాంత్..

ఇందులో రజినీకాంత్ భార్యగా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.. ఇక ఆయన భార్యగా ప్రముఖ సీనియర్ నటి నిరోషా రాధా నటించింది. ఒకప్పుడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత కన్నడ, మలయాళం లో కూడా పలు సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందింది.. ఇక తెలుగులో ముద్దుల మామయ్య, కొబ్బరిబొండం, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, నారీ నారీ నడుమ మురారి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో సినిమాలే కాకుండా సీరియల్స్ లో కూడా తల్లి , అత్త పాత్రలు చేస్తూ బిజీగా ఉంది నిరోషా.

ఇక ఇందులో రజనీకాంత్ భార్యగా, విక్రాంత్ కి తల్లిగా నటించి మెప్పించింది. ఇకపోతే గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలలో కనిపించని నిరోషా ఇప్పుడు తమిళ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతో అందరూ ఆమె పాత చిత్రాలను మళ్లీ నెమరు వేసుకుంటున్నారు. ఇక తెలుగులో కూడా ఆమె నటించాలని కోరుకుంటున్నారు.. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు మూడేళ్ల తర్వాత లాల్ సలాం సినిమాతో నిరోషా తమిళ్ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఇచ్చింది . మరి ఈ సినిమా తర్వాత నిరోషా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత బిజీ అవుతుందేమో చూడాలి.

- Advertisement -

మరొకవైపు నిరోషా రజినీకాంత్ తో పనిచేసిన అనుభవం గురించి, లాల్ సినిమా గురించి పలు ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక ఆ పోస్టులో ఏముంది అంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన నటించే అవకాశం ఇవ్వడం ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్ గా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ అదృష్టాన్ని నాకు కల్పించినందుకు లైకా ప్రొడక్షన్స్ అలాగే ఐశ్వర్య రజనీకాంత్ కి ప్రత్యేక ధన్యవాదాలు.. ఇక మీ ప్రేమ ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను అంటూ నిరోషా పోస్ట్ షేర్ చేసింది

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు