Game Changer : చెర్రీ అభిమానులను నిరాశపరిచిన దేవర రిలీజ్ అనౌన్స్మెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర” మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా, వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించి తారక్ అభిమానులను మేకర్స్ ఫుల్ ఖుషి చేసేశారు. కానీ మరోవైపు “దేవర” రిలీజ్ డేట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను షాక్ కు గురి చేసింది. మరి “గేమ్ ఛేంజర్‌” రిలీజ్ ఎప్పుడు? అని నిరాశకు లోనవుతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “గేమ్ ఛేంజర్‌”. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై క్లారిటీ లేకపోవడం, దాని గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంపై మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నాటికి ఈ సినిమాలో హీరోకు సంబంధించిన వర్క్ అంతా పూర్తవుతుందని, తర్వాత మరో నెల రోజులపాటు మిగిలిన షూటింగ్ ఉంటుందని టాక్ నడిచింది. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని దసరాకు లాక్ చేశారనే టాక్ బయటకు రావడంతో షూటింగ్ అనుకున్న విధంగానే జరుగుతుందని చెర్రీ అభిమానులు నిన్నటిదాకా నమ్మారు. కానీ తాజాగా వచ్చిన “దేవర” రిలీజ్ డేట్ వాళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది.

వాస్తవానికి దిల్ రాజు తన చేతిలో ఉన్న కొన్ని సినిమాల కోసం ఇప్పటికే సంక్రాంతిపై ఖర్చీఫ్ వేసేశారు. కాబట్టి “గేమ్ ఛేంజర్‌” సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేస్తారా ? లేదంటే డిసెంబర్లో విడుదల చేస్తారా? అనే డౌట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. ఒకవేళ ఈ రెండు కాకపోతే 2025 వేసవిలో మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి “గేమ్ ఛేంజర్‌”ను శంకర్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకురావాలనుకుంటున్నాడో ఆయనకే తెలియాలి. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ఆయనపై గుర్రుగా ఉన్నారు. త్వరగా ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే వాళ్ళకున్న ఆకలికి శంకర్ బలవ్వక తప్పదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు