Ooru Peru Bhairavakona : “ఊరు పేరు భైరవకోన” ఫస్ట్ డే కలెక్షన్స్… మిక్స్డ్ టాక్, కుమ్మేసిన కలెక్షన్స్

“ఊరు పేరు భైరవకోన”తో హీరో సందీప్ కిషన్ తన కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మేసింది. మరి ఇంతకీ “ఊరు పేరు భైరవకోన” మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టింది? అంటే…

సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన”. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. “టైగర్” మూవీ తర్వాత సందీప్ కిషన్, డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన రెండవ సినిమా ఇది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. దైవభక్తి, క్షుద్ర శక్తి, కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమాకు పాటలు, ట్రైలర్ ద్వారా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పలు అడ్డంకుల తర్వాత ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది.

ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఊరు పేరు భైరవకోన” మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయడంతో ఈ హార్రర్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమాను చూసిన ఓ వర్గం ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు. టాక్ సంగతి ఎలా ఉన్నా మొత్తానికి మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. దాదాపు 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, 11 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో “ఊరు పేరు భైరవకోన” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే సందీప్ కిషన్ కెరీర్ లోనే ఇదే అత్యధిక బిజినెస్ చేసిన సినిమా.

- Advertisement -

“ఊరు పేరు భైరవకోన” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే… మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 6.3 కోట్ల గ్రాస్, మూడున్నర కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్టు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రీమియర్స్ తో ఈ మూవీ కోటి పది లక్షల వరకు కలెక్షన్స్ సంపాదించింది. అన్నీ కలుపుకుని చూస్తే మొదటి రోజే ఈ సినిమా 7 కోట్ల 20 లక్షలకు పైగా వసూళ్లు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో కోటిన్నర వరకు ఈ మూవీ కలెక్షన్స్ దక్కించుకున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక లాభాల్లోకి అడుగు పెట్టాలంటే “ఊరు పేరు భైరవకోన” మూవీ మరో ఏడు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు