Ooru Peru Bhairavakona: “ఊరు పేరు భైరవకోన” ఓటిటీ పార్టనర్, స్ట్రీమింగ్ డీటెయిల్స్ 

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన”. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. దైవభక్తి, క్షుద్ర శక్తి, కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమాకు పాటలు, ట్రైలర్ ద్వారా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పలు అడ్డంకుల తర్వాత ఈ మూవీ ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఊరు పేరు భైరవకోన” మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయడంతో ఈ హార్రర్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమాను చూసిన ఓ వర్గం ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా “ఊరు పేరు భైరవకోన” మూవీ ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అప్పుడే ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఓటిటి పార్ట్నర్ ఎవరు? ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే నిజానికి ఈ మూవీని లీగల్ సమస్యలు వెంటాడడంతో, ఓటిటి సంస్థలు “ఊరు పేరు భైరవకోన” రైట్స్ కొనడానికి ముందుకు రాలేదని ప్రచారం జరుగుతోంది. కానీ పెయిడ్ ప్రీమియర్స్ తో మంచి బజ్ క్రియేట్ అయిన అనంతరం రైట్స్ కోసం అవే ఓటిటి సంస్థలు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం “ఊరు పేరు భైరవకోన” డిజిటల్ రైట్స్ డీల్ గురించి మేకర్స్ కు కొన్ని ఓటిటి సంస్థలతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ మూవీని సొంతం చేసుకోవడానికి మేకర్స్ కు భారీ డీల్స్ ఆఫర్ చేస్తున్నాయట ఓటిటి ప్లాట్ ఫామ్స్.

ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం “ఊరు పేరు భైరవకోన” మూవీని ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 ఫ్యాన్సీ ధరకు దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఈ మేరకు ఇప్పటికే మేకర్స్ ముందు మంచి డీల్ పెట్టారని అంటున్నారు. త్వరలోనే “ఊరు పేరు భైరవకోన” ఓటిటి పార్ట్నర్, స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక మూవీ ఏదైనా సరే థియేట్రికల్ రన్ తర్వాత రెండు నెలలు లేదా 45 రోజులు ఆగి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లెక్కను బట్టి చూస్తే “ఊరు పేరు భైరవకోన” ఏప్రిల్ రెండవ వారం లేదా మార్చి చివర్లో ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు