Bahubali – the crown of blood : బాహుబలి యానిమేటెడ్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ లాక్… ఇందులో విలన్ ఎవరో తెలుసా?

Bahubali – the crown of blood : పాన్ ఇండియా ట్రెండ్ ను తెరపైకి తీసుకొచ్చిన బాహుబలి ఇప్పుడు యానిమేషన్ సిరీస్ రూపంలో కూడా ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతం నుంచి మరో కొత్త కథ రాబోతోంది. ఇందులో బాహుబలి, బాహుబలి 2 లో చూపించని కథతో ప్రీక్వెల్ గా రాబోతోంది. మరి ఇంతకీ ఈ యానిమేషన్ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాన్ని తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.

మాహిష్మతిపై యుద్ధానికి కట్టప్ప సిద్ధం..

రాజమౌళి బాహుబలి మూవీలో మాహిష్మతి అనే కల్పిత సామ్రాజ్యాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో మాహిష్మతి రక్తదేవ అనే శత్రువుతో పోరాడబోతోంది. ఈసారి విలన్ ఎవరో ఊహించని వ్యక్తి కావడం విశేషం. మొదటి రెండు భాగాలలో బాహుబలికి ఎంతో విధేయుడుగా ఉన్న కట్టప్పే ఈసారి మాహిష్మతిపై దండెత్తబోతున్నాడు. రక్తదేవ సైన్యానికి అధిపతిగా ఉన్న కట్టప్ప తమకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి పైనే సైన్యంతో యుద్ధానికి దిగుతాడు. అతన్ని అడ్డుకోవడానికి నేరుగా బాహుబలి, భళ్లాల దేవ రంగంలోకి దిగే కొత్త కథ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో యానిమేషన్ సిరీస్ రూపంలో రాబోతోంది.

ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

ఈ యాక్షన్ సిరీస్ మే 17 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ కు రాజమౌళి నిర్మాతగా వ్యవహరించగా జీవన్ జె కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. రిలీజ్ డేట్ తో పాటు ఈ యానిమేషన్ సిరీస్ ట్రైలర్ ను హాట్ స్టార్ తాజాగా రిలీజ్ చేసింది. అందులో అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడవడానికి భళ్లాల దేవుడు కొత్త శత్రువుతో చేసిన పోరాటాన్ని చూపించారు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిరీస్ క్యూరియాసిటీని పెంచేస్తోంది. మాహిష్మతికి జీవితాన్ని అంకితం ఇచ్చిన కట్టప్ప ఈసారి బాహుబలికి వ్యతిరేకంగా దండెత్తడం ఎందుకో తెలియాలంటే సిరీస్ ను వీక్షించాల్సిందే.

- Advertisement -

ఇంకా ఎంతో ఉంది – రాజమౌళి

దీని గురించి రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి ప్రపంచం చాలా పెద్దదని, దానికి సంబంధించిన ఫ్రాంచైజీ వచ్చినప్పటికీ ఇంకా ఆ ప్రపంచంలో చూడడానికి ఎంతో కథ ఉందని వెల్లడించారు. ఈ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనేది అక్కడ నుంచే వచ్చిందని, భళ్లాల దేవుడి జీవితంలోని రహస్యాన్ని, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లను ప్రేక్షకుల ముందుకు ఈ సిరీస్ తీసుకురాబోతోందని చెబుతూ ఉత్సాహాన్ని పెంచేశారు.

యానిమేషన్ సిరీస్ పై ప్రభాస్ కామెంట్స్

ప్రభాస్ కూడా ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ ఈసారి బాహుబలి, భళ్లాల దేవుడు కలిసి రావడం ఎక్సైటింగ్ గా ఉందని, దీనిని యానిమేషన్ ఫార్మాట్ లో తీసుకురావడం నచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ కొత్త ప్రయాణాన్ని చూడడానికి తాను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని వెల్లడించారు రెబల్ స్టార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు