Andre Russell’s: క్రికెటర్ ఫస్ట్ బాలీవుడ్ మ్యూజిక్ సాంగ్.. రిలీజ్ డేట్ లాక్..!

Andre Russell’s..ప్రీమియర్ కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్.. బాలికా వధు సీరియల్ తో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన ప్రముఖ మోడల్ అవికా గోర్ తో కలిసి భారత దేశంలో తన మొదటి మ్యూజిక్ వీడియో “లడ్కీ కమల్ కీ” లో అలరించడానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ లో మొదటిసారి మ్యూజిక్ వీడియో ద్వారా అరంగేట్రం చేయనున్నారు ఆండ్రీ.. ఈ మ్యూజిక్ వీడియో ని పలాష్ ముచ్చల్ రచించి, దర్శకత్వం వహించారు. వోయిలా డిజి ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ మ్యూజిక్ వీడియోని మే 9వ తేదీన విడుదల చేయనున్నారు.. ఈ విషయాన్ని కేకేఆర్ స్టార్ ఆండ్రీ తన ఇంస్టాగ్రామ్ పేజీలో షేర్ చేయగా ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Andre Russell's: Cricketer's First Bollywood Music Song.. Release Date Locked..!
Andre Russell’s: Cricketer’s First Bollywood Music Song.. Release Date Locked..!

అవికాగోర్ ,ఆండ్రీ జంటగా..

ఇందులో అవికాగోర్ ,ఆండ్రీ ఇద్దరూ కలిసి ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఈ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేయడం గమనార్హం. ఇకపోతే సంగీత దర్శకుడు వీడియో విడుదల గురించి చాలా సంతోషంగా ఉన్నానని అందులో భాగమైన వారికి తప్పకుండా క్రెడిట్ లభిస్తుందని తెలిపారు..మ్యూజిక్ వీడియో ని సౌరబ్ సింగ్ సెంగర్ నిర్మించగా… ఖలీద్ హకీమ్ షేక్ అలాగే పవన్ శెట్టి కొరియోగ్రఫీ అందించారు. ఈ వీడియోను రూప్ కమల్ సింగ్ ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది..

ఆండ్రీ రస్సెల్..

ఇక ఈ క్రికెటర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో కోల్కతా నైట్ రైడర్స్ లో భాగమయ్యారు. ఈ సీజన్లో ఫ్రాంచైజీని అధిరోహించడంలో అతను కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ యొక్క 17వ ఎడిషన్ లో ఆండ్రీ రస్సెల్ 9 మ్యాచ్ లలో ఆరుసార్లు బ్యాటింగ్ చేశాడు. 44.75 సగటుతో 179 పరుగులు తీసి సీజన్ ఓపెనర్ లో 50 తో సహా 186.45 స్ట్రైక్ రేట్ చేశాడు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ తరఫున 25/3 అత్యుత్తమ గణాంకాలతో 9 వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ గెలిస్తే ఐపీఎల్ ప్లే ఆఫ్ లకు అర్హత వహించే అవకాశం లభిస్తుంది.

- Advertisement -

అవికాగోర్ కెరియర్..

అవికా గోర్ విషయానికి వస్తే..చైల్డ్ ఆర్టిస్ట్ గా టెలివిజన్ నటిగా మంచి పేరు దక్కించుకుంది.కలర్స్ టెలివిజన్లో ప్రసారమైన చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో నటించి తన నటనతో దేశవ్యాప్త ప్రశంసలు అందుకుంది . ఈ సీరియల్ తర్వాత రాజకుమార్ ఆర్యన్ , ససురాల్ సీమర్ కా వంటి సీరియల్స్ లో నటించింది. ఇక హిందీలో బాలిక వధు అనే సీరియల్ తో మంచి పేరు దక్కించుకున్న ఈమె తెలుగులో చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తో మరింత పాపులారిటీ దక్కించుకుంది.ఇక తర్వాత తెలుగులో 2013లో మొదటిసారి ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా హీరోయిన్గా అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు క్రికెటర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ మ్యూజిక్ వీడియో సాంగ్ ఏ మేరకు వీరిద్దరికీ గుర్తింపును అందిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Palaash Muchhal (@palash_muchhal)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు