Ooru Peru Bhairavakona: ఊరు పేరు భైరవకోన పై ఫిర్యాదు… ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో…

Ooru Peru Bhairavakona

వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. దాదాపు రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 09న విడుదల కావాల్సింది. కానీ, ఫిల్మ్ ఛాంబర్ కోరిక మేరకు ఈ నెల 16కు వాయిదా వేసుకున్నారు. ఈగల్ కు సోలో రిలీజ్ కోసం వెనక్కి తగ్గిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ప్రీమియర్స్ ఈ నెల 14నే ఊరు పేరు భైరవకోన థియేటర్స్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ టైంలో సినిమాపై ఓ వివాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రంపై ఫిర్యాదు చేశాడు. ఏదైనా సినిమాకు సెన్సార్ అయిన తర్వాతే రిలీజ్ చేయాలి. సెన్సార్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బుక్ మై షో లాంటి టికెట్ బుకింగ్ సైట్స్ లో టికెట్లను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ, వీటిని ఊరు పేరు భైరవకోన యూనిట్ పాటించలేదనని సీబీఎఫ్‌సీకి నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో సీబీఎఫ్‌కి ఓ లెటర్ రాశాడు. ఈ లెటర్‌‌లో సెన్సార్ నిబందలను పాటించని ఊరు పేరు భైరవకోన సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వదని డిమాండ్ చేశాడు. అలాగే, ఈ చిత్రం నిర్మాతలు సెన్సార్ కోసం ఎప్పుడు అప్లే చేసుకున్నారు? చాలా సినిమాలు సెన్సార్ పూర్తి చేయాల్సి ఉండగా, ఊరు పేరు భైరవకోనకు ముందుగా ఎందుకు సెన్సార్ చేయాల్సి వచ్చింది? అంటూ లెటర్ లో నిర్మాత నట్టి కుమార్ అడిగారు. దీనికి బాధ్యలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

అలాగే, ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతల సినిమాలకు సెన్సార్ త్వరగా అవుతుందని, తమ లాంటి చిన్న నిర్మాతల సినిమాలకు సెన్సార్ అవ్వడానికి నెలల పాటు ఎదురుచూడాల్సి వస్తుందని అన్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా నట్టి కుమార్ చేసిన ఫిర్యాదు ఎక్కడి వరకు వెళ్తుందని, నిజంగానే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాదా ? అని డౌట్స్ వస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం అలాంటిదేమీ ఉండదని, సినిమా అనుకున్నట్టే ప్రిమియర్స్ ద్వారా ఫిబ్రవరి 14న థియేటర్స్ లోకి వస్తుందని అన్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు