Eagle : జోరు చూపించాల్సిందే!

Raviteja

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “ఈగల్” సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల నిర్మించాడు. పలు వాయిదాల అనంతరం రిలీజ్ అయిన ఈగల్ గ్యాప్ రావడం వల్ల పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ కాగా, రవితేజ గత సినిమాల కన్నా బెటర్ గా ఉండడంతో బిసి సెంటర్ల ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఆన్లైన్ బుకింగ్స్ లో ఏమాత్రం జోరు చూపించని ఈ సినిమా ఆఫ్ లైన్ లో మాత్రం మంచి కలెక్షన్లను వసూలు చేసింది.

ముఖ్యంగా సోలో రిలీజ్ ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. చిన్న సినిమాలు పోటీగా రిలీజ్ అయినా ఏ సినిమాకు హిట్ టాక్ రాలేదు. ఇక రజిని లాల్ సలాం సినిమా గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే ఫస్ట్ డే ఈగల్ కు థియేటర్లు బాగా దొరికినా, రవితేజ గత సినిమాల ప్రభావం వల్ల ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. రెండో రోజు మాత్రం ఈగల్ మంచి హోల్డ్ ని చూపించగా, మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో వీకెండ్ ఘనంగా ముగించింది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.8 కోట్ల వరకు షేర్ వసూలు చేసిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ గా 3.4 కోట్ల షేర్ వసూలు చేసింది.

- Advertisement -

ఇక రిలీజ్ అయిన మూడు రోజుల వీకెండ్ లో ఈగల్ వరల్డ్ వైడ్ గా 11.75 కోట్ల షేర్ వసూలు చేయగా 21.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక 21 కోట్ల బిజినెస్ చేసిన ఈగల్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 10 కోట్లయినా రాబట్టాలి. వీకెండ్ అడ్వాంటేజ్ తో కుమ్మిన ఈగల్ ఇప్పట్నుంచే మంచి హోల్డ్ చూపించాల్సి ఉంటుంది. మరి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తర్వాత ఈ సినిమా అయినా ఊరట కలిగిస్తుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు