Eagle : స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తున్నాడు..

Raviteja

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “ఈగల్” సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల నిర్మించాడు. ఇక సంక్రాంతి తరువాత పలు వాయిదాల అనంతరం రిలీజ్ అయిన ఈగల్ ముందు నుండి పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి రవితేజ మార్క్ లో మాత్రం సినిమా లేదని టాక్ వచ్చింది. అయితే రవితేజ గత సినిమాల కన్నా బెటర్ గా ఉండడంతో ఈ సినిమాకు బిసి సెంటర్ల ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.

అయితే ఈగల్ పై రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ లేకపోవడం వల్ల సినిమా కి ఓపెనింగ్స్ యావరేజ్ గా వచ్చాయి. థియేటర్లు బాగా దొరికినా, రవితేజ గత సినిమాల ప్రభావం వల్ల ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. కానీ రెండో రోజు మాత్రం ఈగల్ మంచి హోల్డ్ ని చూపించిందని చెప్పాలి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.87 కోట్ల వరకు షేర్ వసూలు చేసిన ఈ సినిమా, వరల్డ్ వైడ్ గా 3.43 కోట్ల షేర్ వసూలు చేసింది.

- Advertisement -

ఇక రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఈగల్ వరల్డ్ వైడ్ గా 8.35 కోట్ల షేర్ వసూలు చేయగా 15.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. టోటల్ గా 21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈగల్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 13 కోట్లయినా రాబట్టాలి. అయితే మూడో రోజు ఆదివారం వీకెండ్ అడ్వాంటేజ్ అవడంతో ఈగల్ స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తే బ్రేక్ ఈవెన్ కావడానికి అవకాశం ఉండొచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు