RC16: ఆ రోల్ నే శివన్న చేత భర్తీ చేస్తున్నారా?

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ షణ్ముగం దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” లో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. సమ్మర్ ముగిసే లోగా షూటింగ్ ఫినిష్ అవుతుంది. ఈ లోపు రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా స్టార్ట్ చేసేస్తాడు. అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో లో సినిమా అనౌన్స్ అయ్యి కూడా ఏడాది పైనే అయిందని తెలిసిందే. ఇక ఈ సంవత్సరం మార్చ్ లో అఫిషియల్ గా సినిమా ప్రారంభమవనుందని సమాచారం. అయితే ప్రస్తుతం బుచ్చిబాబు ఈ సినిమా క్యాస్టింగ్ ని వెతికే పనిలో ఉన్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారని ఈ మధ్యనే అఫిషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే కొన్నాళ్ల ముందు RC16 లో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారని వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తీరా విజయ్ సేతుపతి గాని, మేకర్స్ నుండి గాని దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ గాని, సమాచారం గాని రాలేదు. అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రనే శివరాజ్ కుమార్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. పైగా శివరాజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూ లో తాను RC 16 లో నటిస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. కానీ విజయ్ గురించి తాను గాని, టీమ్ నుండి గాని కన్ఫర్మేషన్ రాలేదు.

- Advertisement -

దీన్ని బట్టి ఒకవేళ విజయ్ సేతుపతి రోల్ నే శివన్న తో భర్తీ చేయిస్తున్నారని తెలుస్తుంది. ఒకవేళ సినిమాలో ఇద్దరూ నటులు కీ రోల్ ప్లే చేసే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా చిత్ర యూనిట్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఏమి చేయలేము. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతోందని తెలిసిందే. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు