Star Actress: కార్ పంపిస్తా నైట్ కి వస్తావా అన్నాడు.. డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు..!

Star Actress.. సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం ఎంతలా ప్రకంపనలు రేపిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ ఉద్యమం వల్ల చాలామంది బాధిత నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు వచ్చి మొదటిసారి మాట్లాడారు.. దీంతో చాలామంది నిర్మాతలు, డైరెక్టర్ ల భాగోతాలు బయటపడ్డాయి. అయితే ఆ తర్వాత ఎందుకో గాని ఈ ఉద్యమం కాస్త చల్లబడిపోయింది. అయితే ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఈమధ్య చాలామంది తాము ఎదుర్కొన్న అవమానాలు, వేధింపుల గురించి నోరు విప్పి మాట్లాడుతున్నారు. దేనికి భయపడకుండా తమ కెరియర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు జరిగిన ఒక చేదు ఘటన గురించి చెప్పుకొచ్చింది ప్రముఖ నటి..

Star Actress: Will you come to send the car to the night? Sensational comments on the director..!
Star Actress: Will you come to send the car to the night? Sensational comments on the director..!

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో..

మూడున్నర దశాబ్దాల క్రింద చిత్ర సీమలోకి అడుగు పెట్టి ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఉపాసన సింగ్.. సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె కెరియర్ ఆరంభంలోనే ఒక డైరెక్టర్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది.. హిందీ సినిమాలు చూసే వారికి ఈమె గురించి పరిచయం అవసరం లేదు.. 1988లో వచ్చిన బాయి చలీ ససురాయి అనే రాజస్థానీ చిత్రంతో కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత హిందీ తో పాటు పంజాబీలో కూడా పలు సినిమాలు చేస్తూ వచ్చింది. హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసినా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది . 1997లో విడుదలైన జుదాయి అనే చిత్రం ద్వారా భారీ క్రేజ్ దక్కించుకుంది. ఒక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కెరీర్ తొలినాళ్లల్లో తాను ఎదుర్కొన్న చేదు ఘటన గురించి వెల్లడించింది..

సౌత్ డైరెక్టర్ నన్ను హోటల్ కి పిలిచారు..

సౌత్ డైరెక్టర్ నన్ను అనిల్ కపూర్ సరసన నటింపజేస్తానని చెప్పాడు.. అనంతరం ఆయన నన్ను నైట్ హోటల్లో మీటింగ్ కి పిలిచాడు.. అప్పటికి నా వయసు 17 సంవత్సరాలు మాత్రమే.. ఏం చెప్పాలో అర్థం కాలేదు.. తర్వాత రోజు వస్తానని చెప్పాను.. అప్పుడు కారు పంపిస్తాను అని ఆ డైరెక్టర్ అన్నారు… దీంతో ఆయన మాటలు అర్థం చేసుకొని తీవ్రంగా మందలించాను ..నా గురించి ఇలా ఎలా ఆలోచించావంటూ సీరియస్ అయ్యాను. ఇది జరిగిన తర్వాత ఏడు రోజుల వరకు ఇంటి నుంచి బయటకు రాలేదు.. ఏడుస్తూనే ఉండిపోయాను అంటూ ఉపాసన సింగ్ తెలిపారు.. అయితే ఆ సౌత్ డైరెక్టర్ ఎవరు అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీమనులు ఇలా ఎవరో ఒకరి చేత క్యాస్టింగ్ కౌచ్ కి గురవుతూ ఇబ్బంది పడుతున్నారు.. ఎన్ని విధాలుగా ఎంతమంది సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా.. ఇప్పటికి ఈ సమస్య సద్దుమనగలేదనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు