NBK110 : బాలయ్య నే నమ్ముకున్న బోయపాటి?

Boyapati Srinu

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబో చాలా ప్రత్యేకమైనది. ఈ కాంబో లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. ఇటు నందమూరి బాలకృష్ణ పదేళ్ల పాటు సరైన హిట్ లేక సతమతమవుతున్న దశలో సింహా తో భారీ విజయాన్ని అందించిన బోయపాటి, ఆ తర్వాత బాలయ్య తో లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ ని తీశారు. ఒకప్పుడు బి. గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందో, ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి కాంబో అంత సక్సెస్ అయింది.

అయితే బాలయ్య తో మినహా బోయపాటి ఎవరితో సినిమా చేసినా హిట్టు కొట్టలేకపోతున్నాడు. బోయపాటి సినిమాలన్నీ ఒకే ఫార్మాట్ లో మాస్ జోనర్ లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉన్నట్టు, బోయపాటి శ్రీను ఏ హీరోతో తీసినా వారి కటౌట్ తో ఫాలోయింగ్ తో సంబంధం లేకుండా ఒకేలా సినిమా తీస్తాడు. అందుకే వరుస ప్లాపులు ఎదుర్కున్నాడు. అప్పుడెప్పుడో పదేళ్ల కింద అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు యావరేజ్ టాక్ తెచ్చుకుని, హాలిడేస్ అడ్వాంటేజ్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది. అది కూడా అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ వల్లే సగం సినిమా ఆడిందని ఎవరైనా చెప్తారు.

- Advertisement -

ఇక బోయపాటి కెరీర్ బిగినింగ్ లో తీసిన భద్ర, తులసి సినిమాలకు కొరటాల శివ రచనా సహకారం అందించగా, ఈ సినిమాలు కూడా బాలయ్య తో సినిమా కంటే ముందు వచ్చినవి. ఓవరాల్ గా బాలకృష్ణ తో తప్ప మిగతా ఏ హీరోలతో కూడా బోయపాటి సరైన సినిమా తీయాలకపోతున్నాడు. రీసెంట్ గా రామ్ హీరోగా వచ్చిన స్కంద కూడా డిజాస్టర్ అయింది.

ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను ఈ మధ్య అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్స్ కి కథ వినిపించానని పలు ఇంటర్వ్యూ ల్లో అన్నారు. అయితే వాళ్లిద్దరూ కూడా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు వదిలి వేరే సినిమాలు చేసే ప్రసక్తే లేకపోవడంతో బోయపాటికి మళ్ళీ బాలయ్యే దిక్కయ్యాడు. బాలకృష్ణ తో అఖండ సీక్వెల్ తీసేందుకు ఆల్మోస్ట్ కంఫర్మ్ అయినట్టే అని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం బాబీ తో సినిమా చేస్తున్న బాలయ్య అది పూర్తవగానే బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేస్తారట. ఇక ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్, లేదా ద్వారకా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే అవకాశం ఉంది. ఏది ఏమైనా బోయపాటి శ్రీను ఇతర హీరోలను కూడా హ్యాండిల్ చేయగలనని నిరూపించుకునే అవసరం ఎంతో ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు