Bhimaa : “మ్యాచొ స్టార్” సినిమాకు హై డిమాండ్?

Gopichand

టాలీవుడ్ మ్యాచో స్టార్ ‘గోపిచంద్’ ప్రస్తుతం కన్నడ స్టార్ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ‘భీమా’ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మిస్తున్నాడు. ఇక భీమా సినిమాలో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అయితే గోపిచంద్ పోలీస్ గా నటించిన సినిమాలన్నీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్సే. ఇంతకు ముందు ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ వంటి సినిమాల్లో పోలీస్ గా నటించాడు. అవి ఏ రేంజ్ హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో భీమా వస్తుంది.

ఇక భీమా టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకోగా మార్చి 8న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకు బయ్యర్లు క్యూ కడుతున్నారు. గోపీచంద్ గత సినిమాల రిజల్ట్ ని చూసి కూడా, గోపీచంద్ పోలీస్ అన్న సెంటిమెంట్ తో, పైగా టీజర్ సాలిడ్ ఇంపాక్ట్ చూపించడంతో డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఎక్కువే వెచ్చించడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆంద్ర ఏరియా 8 కోట్లకు అమ్ముడు పోయినట్టు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం వచ్చింది. అలాగే అందులో కేవలం వైజాగ్ ఏరియాకే 2 కోట్ల వరకు డిమాండ్ పెరిగిందట. ఇక సీడెడ్ లో 3 నుండి 4 కోట్లు, నైజాం 7 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.

- Advertisement -

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో భీమా 16 నుండి 18 కోట్లు, ఓవర్సీస్, కర్ణాటక సహా 20 నుండి 22 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందని సమాచారం. అయితే రీసెంట్ గా గోపీచంద్ నటించిన చిత్రాల్లో 20 కోట్లకి మించి ఏ సినిమా బిజినెస్ చేయలేదు. భీమా కనుక ఈ ఫీట్ ని సాధిస్తే గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ జరిగిన సినిమా ఇదే అవుతుంది. అయితే బిజినెస్ ఎలా జరిగినా గోపిచంద్ కి ఇప్పుడు హిట్ రావడం కూడా కంపల్సరీ. ఒక స్టార్ గా టైర్ 2 హీరోల్లో ఒకడిగా నిలవాల్సిన వాడు, రొటీన్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ వల్ల తన మార్కెట్ ని డౌన్ చేసుకున్నాడు. ఏది ఏమైనా భీమా తో గోపీచంద్ సాలిడ్ కం బ్యాక్ కొట్టి తన సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ కి చూపించాలని ఫ్యాన్స్ తో పాటూ కామన్ ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు