Gopichand : ఆరోజున ‘భీమా’ మాస్ అవతారం..

టాలీవుడ్ మ్యాచో స్టార్ ‘గోపిచంద్’ రామబాణం తర్వాత చాలా డీలా పడ్డాడన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలతో ఊర మాస్ సినిమాలతో రచ్చ చేసే ఈ హీరో కొన్నేళ్లుగా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు పరిమితమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు తన రూటు మార్చి ఒక మాస్ డైరెక్టర్ తో ఊరమాస్ సినిమాతో రానున్నాడు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్నట్టు గోపీచంద్ తన ఫాలోయింగ్ ఏంటో తెలుసుకున్నాడు. తన నుండి ఫ్యాన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం కన్నడ స్టార్ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ‘భీమా’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మిస్తున్నాడు. భీమా సినిమాలో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అయితే గోపిచంద్ పోలీస్ గా నటించడం కొత్తేమి కాదు. అసలు తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నవే పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు. ఇంతకు ముందు ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ వంటి సినిమాల్లో పోలీస్ గా నటించాడు. అవి ఏ రేంజ్ హిట్ అయ్యాయో తెలిసిందే.

ఇక భీమా సినిమా నుండి లేటెస్ట్ గా గోపీచంద్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ వచ్చింది. భీమా మూవీ యొక్క అఫిషియల్ టీజర్ ని జనవరి 5న మధ్యాహ్నం 1.11 గంటలకు రిలీజ్ చేస్తునట్టు మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఈ అప్డేట్ ని గోపీచంద్ ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేయగా, ఆ పోస్టర్ లో కుర్చీ మీద కూర్చున్న గోపీచంద్ లుక్ రాయల్ గా ఉండి ఆకట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే గోపీచంద్ పోస్టర్ తో టీజర్ రాకముందే సినిమాపై సాలిడ్ హైప్ తీసుకొచ్చాడని చెప్పాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు