Gopichand: సాలిడ్ పోస్టర్ తో దీపావళి విషెస్ చెప్పిన “భీమా”..

మ్యాచో స్టార్ గోపీచంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రామబాణం సినిమాతో డిజాస్టర్ అందుకున్న గోపి, ఆ డిజాస్టర్ ఇచ్చిన షాక్ నుండి తొందరగానే కోలుకుని తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేసాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాతో బిజీగా ఉన్న గోపీచంద్, ఆ షెడ్యూల్ అయిపోయాక భీమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ, రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ఇక భీమా సినిమాని కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గోపీచంద్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసి అంచనాలు పెంచేయగా, ఆ లుక్ లో గోపీచంద్ ని ఒక గంగిరెద్దు తో పోలుస్తూ పోస్టర్ డిజైన్ చేసారు. ఇక తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్ తో దీపావళి విషెస్ ని తెలియచేస్తూ భీమా పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.

ఆ పోస్టర్ లో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో డైనమిక్ గా ఉండగా, పోలీస్ జీప్ పై కూర్చుని, రౌడీ మూక ని తాళ్లతో కట్టేసినట్టు ఉంది. ఈ పోస్టర్ తో గోపీచంద్ యొక్క ఆంధ్రుడు, శౌర్యం నాటి వైబ్స్ గుర్తొచ్చాయి. ఇక ఈ సినిమా ని 2024 లో రిలీజ్ చేస్తామని ప్రకటించగా, ఈ సినిమాకి కన్నడ సెన్సేష్నల్ మ్యూజిక్ డైరెక్టర్ “రవి బసూర్” సంగీతం సమకూరాస్తున్నాడు. సంక్రాంతి కానుకగా భీమా టీజర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు