Japan Movie: చేసేదేమీ లేదు… అంతా అయిపోయింది అను

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన జపాన్ సినిమా తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో చూడటానికి ఏం లేదని, కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదని, దొంగ కాన్సెప్ట్ కూడా ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదని క్రిటిక్స్ రివ్యూ చెబుతున్నారు. దీని వల్ల నష్ట కార్తీకి అయితే పెద్దగా ఏం జరగదు. అని చెప్పొచ్చు. ఎందుకంటే, కార్తీకి ఖైదీ నుంచి మొన్నటి పొన్నియన్ సెల్వన్ 2 వరకు చాలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క ఫ్లాప్ పడితే జరిగే నష్టం అంతా ఎఫెక్ట్ ఏం ఉండదు. అయితే తన కెరీర్ లో 25వ మూవీ ఫెయిల్ అయింది అనే చిన్న బాధ అయితే ఉండొచ్చు.

అయితే జపాన్ మూవీ రివ్యూ రిజెల్ట్ ఎవరికీ ప్రభావం చూపిస్తుంది అంటే.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌కి. అను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 12 ఏళ్లు అవుతుంది. కానీ, ఒక హిట్ కూడా లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి కూడా అనుకు లైఫ్ ఇవ్వలేక పోయింది. ఇప్పుడు ఈ బ్యూటీ హోప్స్ పెట్టుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది.. జపాన్ మాత్రమే. కానీ, ఇప్పుడు ఇప్పుడు జపాన్ కూడా చేతులెత్తేసింది.

ఫస్ట్ షో నుంచే ఈ జపాన్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన హీరో కార్తీ పాత్ర గురించి, ఆయన బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డెలవరీకి మంచి టాక్ వస్తుంది. కానీ, సినిమాలో హీరోయిన్ గా ఉన్న అను పాత్ర గురించి అయితే ఎక్కడా కూడా పాజిటివిటీ వినిపించడం లేదు.

- Advertisement -

సినిమా ఫెయిల్ అయితే, కథ పరంగా, కథనం పరంగా అయి ఉంటుంది. కానీ, అను ఇమ్మాన్యుయేల్ కి యాక్టింగ్ పరంగా మంచి మార్కులు రావాలి కదా… అలా రాకుంటే, నటిగా అను ఇమ్మాన్యుయేల్ ఫెయిల్ అయింది అంటూ క్రిటిక్స్ నుంచి ఆన్సర్స్ వస్తున్నాయి. జపాన్ సినిమా తర్వాత అను ఇమ్మాన్యుయల్ సినిమాలకు గుడ్ బై చెప్పి… ఇతర రంగాల్లో ఫోకస్ చేయాలని, లేదా పెళ్లి చేసుకుని హాయిగా భర్తతో ఉండాలి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు