Japan: గురూజీ దించిన గునపం మళ్ళీ గుర్తొచ్చింది.

కొన్ని కాంబినేషన్ లో సినిమాలు వస్తున్నాయి అంటే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. అలాంటి కాంబినేషన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బేసిగ్గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి ఒక మంచి హిట్ ఇచ్చిన ప్రతి డైరెక్టర్ మళ్లీ రెండోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసినప్పుడు ఫెయిల్ అయ్యారు.

సుస్వాగతం సినిమా చేసిన భీమినేని శ్రీనివాస్ అన్నవరం సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. తొలిప్రేమ వంటి హిట్ ఇచ్చిన కరుణాకర్ కూడా బాలు సినిమాతో ఆకట్టుకోలేకపోయారు. అలానే బద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా దగ్గర ఫెయిల్ అయ్యారు. ఖుషి లాంటి కెరియర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కూడా ఎస్ జె సూర్య కూడా కొమరం పులి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫెలయ్యారు.

పవన్ కళ్యాణ్ తో రెండోసారి పనిచేసిన త్రివిక్రమ్ మాత్రం అత్తారింటికి దారేది సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అప్పటికి గబ్బర్ సింగ్ జోష్ లో ఉన్న కళ్యాణ్ కి దాన్ని మించిన హిట్ త్రివిక్రమ్ అందించాడు. ఈ రెండు సినిమాలు అద్భుతంగా హిట్ అవ్వటం వలన వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే అజ్ఞాతవాసి సినిమా పైన అంచనాలు ప్రేక్షకులకు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు అది పవన్ కళ్యాణ్ కి 25వ సినిమా కావడం కూడా అంచనాలను మరింత పెంచింది. ఒక మైల్ స్టోన్ ఫిలిం గా ఈ సినిమా చరిత్రలో నిలబడిపోద్ది అని అనుకున్నారంతా, కానీ గురూజీ గురూజీ అని పిలిచినందుకు చిన్నగా గుణపం దించాడు త్రివిక్రమ్.

- Advertisement -

ఇకపోతే తెలుగు ప్రేక్షకులకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించాడు కార్తీ. తమిళ్ ప్రేక్షకులు కంటే కూడా తెలుగు ప్రేక్షకులు అంటేనే తనకు ఎక్కువ ఇష్టం అంటుంటాడు కార్తీ. అయితే రీసెంట్ గా కార్తీ నటించిన సినిమా జపాన్. ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అనుకున్నారంతా, దానికి తోడు ఈ సినిమా కార్తీకి 25వ సినిమా కావడం కూడా ఇంకొంత అంచనాలను పెంచింది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మైల్ స్టోన్ ఫిల్మ్ గా చెప్పుకునే 25వ సినిమా పవన్ కళ్యాణ్ కి వర్కౌట్ కాలేదు. ఇక్కడ కార్తీకి కూడా వర్కౌట్ కాలేదు. కొన్ని హిట్ సినిమాలు ఎలా గుర్తు పెట్టుకుంటామో, కొన్ని మైల్ స్టోన్ ఫెయిల్యూర్స్ ని కూడా ఎప్పటికీ మర్చిపోలేము అంటూ మరోసారి గురూజీ దించిన గునపాన్ని గుర్తుచేసుకుంటున్నారు ప్రేక్షకులు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు