Samantha: ఇంస్టాలో ఫొటోస్ ఒకే, కానీ ఇండస్ట్రీలో సినిమా ఎప్పుడు

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఏమాయ చేసావే సినిమాలో సమంత చేసిన జెస్సీ క్యారెక్టర్ ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఎవరూ మరువలేరు. అంత అద్భుతంగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది సమంత. ఏమాయ చేసావే సినిమాలో సమంత వేసుకున్న బట్టలు, సమంతా లుక్స్, సమంత ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.

ఆ సినిమా తర్వాత తెలుగులో మరికొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సాధించుకుంది సమంత. తెలుగులో ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కూడా జతకట్టి మంచి హిట్ సినిమాలను అందుకుంది. సమంత కొన్ని ఏళ్ళు నాగచైతన్యతో ప్రేమలో ఉండి పెళ్లి చేసుకుని కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత సమంత వరుస సినిమాలు చేస్తూ లైఫ్ లో బిజీగా ఉండింది. కానీ ప్రస్తుతం సమంత సినిమాలకు కొంతవరకు గ్యాప్ ఇచ్చింది.

తను చివరగా చేసిన ఖుషి సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేయలేదు స్యామ్. ప్రస్తుతం సిటాడెల్ అనే ప్రాజెక్టును మాత్రమే చేస్తుంది. సమంత ఇప్పటివరకు సినిమాలను అనౌన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటుంది. స్యామ్ ప్రస్తుతం తన సినిమా కెరియర్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి లైఫ్ ని ట్రిప్స్ తో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది.

- Advertisement -

స్యామ్ ఇంస్టాగ్రామ్ వేదిక పంచుకుంటున్న ఫొటోస్ అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే శ్యామ్ ని ఇష్టపడే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇంకొంతమంది మాత్రం ఇలా ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుందా, లేకపోతే సినిమాలు చేస్తావా అంటూ కామెంట్స్ కూడా మొదలుపెట్టారు. స్యామ్ చివరగా చేసిన ఖుషి సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. మళ్లీ సమంత కం బ్యాక్ ఇచ్చి అద్భుతమైన సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి, సమంతాకి బ్రహ్మరథం పట్టడానికి ఇప్పటికే కాదు ఎప్పటికీ రెడీగా ఉంటారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు