Tollywood: సమంత ‘బజార్ ఫోటోషూట్’పై చైతూ షాకింగ్ రియాక్షన్..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ వారికి సంబంధించిన వార్త‌ల్లో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. వీరిద్ద‌రూ విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే విడాకుల త‌ర‌వాత స‌మంత మ‌యోసైటిస్ జ‌బ్బుతో బాధ‌ప‌డుతూ వార్తల్లో నిలిచింది. ఇప్ప‌టికే చికిత్స తీసుకున్న‌ప్ప‌టికీ జ‌బ్బు త‌గ్గ‌లేదు. రీసెంట్ గా మ‌రోసారి స‌మంత అనారోగ్యం బారిన‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ చికిత్స కోసం విదేశాల‌కు వెళ్లింది. అంతే కాకుండా చికిత్స కోసం ప్ర‌స్తుతం స‌మంత సినిమాల‌కు బ్రేక్ కూడా ఇచ్చింది. అఫీషియ‌ల్ గా చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ సామ్ బ్రేక్ తీసుకుంటున్న‌ట్టు మీడియాకు వార్త‌లు లీక్ అయ్యాయి. ఖుషి సినిమా త‌ర‌వాత స‌మంత సినిమాల‌కు బ్రేక్ తీసుకోగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె సినిమాల‌పై మ‌ళ్లీ అప్డేట్ రాలేదు. అయితే ఇంత‌లోనే స‌మంత హాట్ ఫోటో షూట్ తో అభిమానుల‌కు నెటిజ‌న్ల‌కు షాక్ ఇచ్చింది.

చికిత్స తీసుకుంటుంద‌నుకున్న స‌మంత బ‌జార్ అనే మ్యాగ‌జైన్ లో హాట్ ఫోజుల‌తో రెచ్చిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోల‌పై కొంత‌మంది ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. స‌మంత ఈ రేంజ్ లో హాట్ షో చేయ‌డం అవ‌స‌రమా అంటూ మండిప‌డుతున్నారు. అయితే ఈ ఫోటోలపై స‌మంత మాజీ భ‌ర్త నాగ‌చైత‌న్య కూడా స్పందించిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

చైతూ ఫ్రెండ్ ఒక‌రు స‌మంత ఫోటోల‌పై వ‌స్తున్న కామెంట్స్ గురించి నాగ‌చైత‌న్య వ‌ద్ద ప్ర‌స్తావించార‌ట‌. అయితే చైతూ మాత్రం ఆ కామెంట్స్ పై చాలా పాజిటివ్ గా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ఎవ‌రి జీవితం వాళ్ల ఇష్ట‌మ‌ని ఎవ‌రైనా వారికి న‌చ్చిన‌ట్టు బ్ర‌త‌క‌వ‌చ్చ‌ని నాగ‌చైత‌న్య చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గ‌తంలో కూడా ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో నాగ‌చైత‌న్య స‌మంత గురించి పాజిటివ్ గా స్పందించిన సంగ‌తి తెలిసిందే.

విడాకులకు సంబంధించి ఏ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న‌లు వేసినా చైతూ స‌మంత గురించి ఎప్పుడూ త‌ప్పుగా మాట్లాడ‌లేదు. కేవ‌లం నాగ‌చైత‌న్య మాత్ర‌మే కాకుండా అత‌డి కుటుంబ స‌భ్యులు నాగార్జున కూడా స‌మంత‌పై నెగిటివ్ కామెంట్లు చేయ‌లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు