Raja The Great: క్రేజీ కాంబో రిపీట్… హీరోలకు ఇచ్చిపడేస్తున్న అనిల్ రావిపూడి

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతంగా ఇండస్ట్రీలో అందరూ ఆయనను హిట్ మెషిన్ అని పిలుచుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. టాలీవుడ్ కు అనిల్ రావిపూడి “భగవంత్ కేసరి”తో వరుసగా ఏడో హిట్‌ని అందించాడు. తన కెరీర్‌లో పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు, ఎన్‌బికెతో తాజా చిత్రం భగవంత్ కేసరి వంటి సినిమాలతో టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా హిట్స్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన “భగవంత్ కేసరి” హిట్ గా నిలవగా, అనిల్ నెక్స్ట్ మూవీ గురించి ఇప్పుడు టాక్ నడుస్తోంది.

ఇక అనిల్ రావిపూడి తదుపరి సినిమాపై చాలా రూమర్స్ వస్తున్నాయి. అందులో ఒకటి మాస్ మహారాజ్ రవితేజకు ఆయన రఫ్ స్క్రిప్ట్ చెప్పాడని, రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాడని, వచ్చే ఏడాది ప్రారంభంలో రవితేజకు ఫైనల్ స్క్రిప్ట్‌ను వివరిస్తాడని సమాచారం, ఆ తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుంది. అనిల్‌తో అత్యధిక చిత్రాలను నిర్మించిన దిల్ రాజు ఈ ప్రాజెక్టును కూడా నిర్మించనున్నారని టాక్. ఇక రవితేజ, అనిల్ రావిపూడి ఇద్దరూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

నిజానికి అనిల్ మెగాస్టార్‌తో తన నెక్స్ట్ మూవీ చేయాల్సి ఉంది. అయితే చిరంజీవి వచ్చే ఏడాది వరకు వశిష్ఠ సినిమాతో బిజీగా ఉన్నందున ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. ఈలోగా అనిల్ మరో సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు రవితేజ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే రవితేజ, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ 2024 వేసవిలో ప్రారంభమవుతుంది. కాగా గతంలో అనిల్ రావిపూడి, రవితేజ కాంబోలో “రాజా ది గ్రేట్” వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుందన్న వార్తతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

- Advertisement -

For More Updates :  Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు