Chiranjeevi vs Allu Arjun : బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తే చిరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ? గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్

Chiranjeevi vs Allu Arjun : ఏపీలో మరికొన్ని గంటల్లో జరగబోతున్న ఎలక్షన్స్ మెగా, అల్లు అభిమానుల మధ్య చిచ్చుపెట్టాయి. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయగా, ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి తన సపోర్టును తెలపడం సంచలనగా మారింది. ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా బన్నీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి థాంక్స్ చెప్తారా? అంటూ ఫుల్ ఫైర్ అవుతున్నారు మెగా ఫాన్స్. మరి ఇందులో చిరు చేసిన తప్పేంటి? చిరుపై మెగా ఫాన్స్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? అనే విషయంలోకి వెళ్తే…

ఏపీలో మే 13న జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ నేపథ్యంలో ఈరోజుతో ప్రచారానికి చివరి రోజు. ఈ క్రమంలోనే చివరి నిమిషంలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం చేరుకున్నారు. అక్కడ ఆయన తన బాబాయ్ తో కలిసి అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. మరోవైపు మెగా ఫాన్స్ కలలో కూడా ఊహించని విధంగా అల్లు అర్జున్ వైఎస్ఆర్సిపికి చివరి నిమిషంలో తన సపోర్ట్ తెలిపి షాక్ ఇచ్చారు. ఈరోజు బన్నీ నంద్యాలకు చేరుకుని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న కాండిడేట్ కి సపోర్ట్ గా ప్రచారం చేశారు. నంద్యాలలో అల్లు అర్జున్ ను చూడడానికి భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. అలాగే చెర్రీ కోసం కూడా చాలా మంది పిఠాపురం చేరుకున్నారు. మొత్తానికి చివరి నిమిషంలో ఇద్దరు హీరోలు ఇచ్చిన కిక్ ఓటర్ల పై గట్టి ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ చేసుకున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైసీపీకి సపోర్ట్ గా నిలబడిన అల్లు అర్జున్ అంటే పీకల్లోతు కోపంతో ఉన్నారు మెగా ఫాన్స్. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరు చేసుకున్న ట్వీట్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి మే 9న అత్యంత అరుదైన గౌరవం పద్మ విభూషణ్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ చిరంజీవికి అభినందనలు తెలుపుతూ, ఇది తెలుగు వాళ్ళకు గర్వకారమైన క్షణం అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

ఆ ట్వీట్ కి మెగాస్టార్ రిప్లై ఇస్తూ థాంక్స్ చెప్పారు. ఇక ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తే చిరంజీవి ఎలా థాంక్స్ చెప్పారు అంటూ ఫైర్ అవుతున్నారు మెగా ఫాన్స్. కానీ కొంతమంది మాత్రం బన్ని చివరి నిమిషంలో వైసిపికి సపోర్ట్ చేశాడనీ, కానీ అంతకంటే ఒకరోజు ముందే చిరుకి విషెస్ చెప్పారని గుర్తు చేస్తున్నారు. అయినా అభినందించిన వారిని ఏదో ఒకటి అనడం అనేది సంస్కారం కాదు అంటూ చిరుకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఏపీ పాలిటిక్స్ మెగా, అల్లు అభిమానుల మధ్య కొత్త చిచ్చును రేపాయి. మరి ఇది ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు