Balakrishna: హ్యాట్రిక్ వెనుక ఆమె హస్తం.. విస్తుపోయే నిజాలు బయట పెట్టిన చిన్నల్లుడు..!

Balakrishna.. సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు దీటుగా తన సినిమాలను తెరకెక్కిస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. మరొకవైపు పొలిటికల్ పరంగా కూడా పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్నారు బాలయ్య. ఆహా వంటి ఓటీటీ సంస్థలలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. బాలకృష్ణ సినీ కెరియర్ విషయానికి వస్తే.. గత పదేళ్ళ నుంచి బోయపాటి శ్రీను తో తీసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

Balakrishna: Her hand behind the hat-trick.. The child who revealed shocking truths..!
Balakrishna: Her hand behind the hat-trick.. The child who revealed shocking truths..!

బాలయ్య సక్సెస్ కి ఆమె కారణం..

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బాలయ్య తను తీసే ప్రతి సినిమా కూడా హిట్ కావాలని సరైన కథలతో విభిన్నమైన కాన్సెప్ట్లతో ముందుకు వెళుతున్నారు. చివరిగా బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీకి కామెడీ.. యాక్షన్ ఎంటర్టైన్మెంట్..కూతురు సెంటిమెంట్ ఇలా అన్నీ కూడా కొత్త తరహా సబ్జెక్టు కావడంతో బాలయ్య మంచి విజయాన్ని అందుకున్నారు. బాలయ్య ఈ జనరేషన్ లో కూడా వరుస హ్యాట్రిక్ అందుకున్న హీరోగా పేరు సంపాదించారు.

అసలు నిజాలు బయటపెట్టిన భరత్..

గతంలో బాలయ్య అంటే కోపిష్టి అని.. అందరినీ కొడతారని కామెంట్లు మాత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి.. అంతేకాకుండా పబ్లిక్ లో అలాంటి సంఘటనలు కూడా ఎన్నో వైరల్ గా మారాయి. అయితే ఇటీవల కాలంలో బాలయ్య లో చాలా మార్పు వచ్చింది.. సినిమా కథల ఎంపిక విషయంలో డ్రెస్సింగ్ స్టైల్ లో కూడా చాలా మార్పు గమనించవచ్చు. ముఖ్యంగా ఇలా రావడానికి ఒక బలమైన కారణం ఉందట.. అదేమిటంటే బాలకృష్ణ వెనక ఒక వ్యక్తి ఉన్నది.. ఆమె ఎవరో కాదు బాలయ్య చిన్న కూతురు తేజస్విని.. ముఖ్యంగా తన తండ్రిని సరికొత్తగా చూపిస్తూ.. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను పరిచయం చేసేలా చేస్తూ ఉంటుంది.

- Advertisement -

అందుకే బాలయ్యకు సంబంధించి మేకింగ్ ప్రొడక్షన్ ఇతరత్రా వాటిపైన కూడా ఇన్వాల్వ్ అయి తన తండ్రిని స్టార్ పొజిషన్ లోకి తీసుకువచ్చింది. అందుకే ఈ మధ్యకాలంలో బాలయ్యలో చాలా చేంజ్ వచ్చిందని పలువురు అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. ఎలాంటి విషయాన్నైనా సరే తన చిన్న కూతురు తేజస్విని తో డిస్కషన్ చేసిన తర్వాతే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం. అన్ స్టాపబుల్ షోలో కూడా బాలయ్యను సరికొత్తగా చూపించడం వెనుక తేజస్విని హస్తం కూడా ఉన్నది. తన చిన్న కూతురు ఎంట్రీ తో బాలయ్య కెరియరే మరొకసారి మలుపు తిరుగుతోంది. అంటూ ఈ విషయాలన్నింటినీ తేజస్విని భర్త బాలయ్య చిన్నల్లుడు భరత్ వెల్లడించారు..

బాలయ్య సినిమాలు..

బాలయ్య సినిమా కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109 వ చిత్రంలో నటిస్తున్నారు… ఇందులో విలన్ గా బాబి డియోల్ నటిస్తూ ఉండగా.. హీరోయిన్ ఇంకా ఎవరిని ఫిక్స్ చేయలేదు. ఈ చిత్రం ఏడాది విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు