OTT Movie : క్షణం క్షణం ఉత్కంఠ రేపే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటిటిలోకి… స్ట్రీమింగ్ ఎందులో అంటే?

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కొత్తగానే ఉంటాయి. ప్రస్తుతం అరవింద్ కృష్ణ, రజిత్ రాఘవ హీరోలుగా నటించిన సిట్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మే 10 నుంచి జీ5 అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్షణం క్షణం ఉత్కంఠ రేపే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటాషా దోషి, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటించారు. సిట్ మూవీకి బీవిఆర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తున్నారు.

సిట్ స్టోరీ…

ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం. దానికి తగ్గట్టుగానే ఏదైనా ఒక క్రైమ్ ను పరిష్కరించడానికి ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ తో సెపరేట్ గా ఆ కేసు కోసమే బృందాన్ని నియమిస్తారు. సిట్ మూవీ లో ఓ క్రైమ్ ను సాల్వ్ చేసే నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ల బృందానికి ఎలాంటి ఛాలెంజెస్  ఎదురయ్యాయి ? సంచలనం రేపిన ఒక క్రైమ్ ను పోలీస్ ఆఫీసర్ తన తెలివిని ఉపయోగించి ఎలా సాల్వ్ చేశాడు అనే అంశాన్ని మేకర్స్ థ్రిల్లింగ్ అంశాలతో చూపించినట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆఫీసర్ రోల్ లో అరవింద కృష్ణ నటించాడు. కౌశిక్ మేకల, అనిల్ రాథోడ్ కీలక పాత్రలు పోషించారు.

లేట్ గా సిట్ రిలీజ్..

అయితే నిజానికి ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే పూర్తయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల థియేటర్లలో సిట్ మూవీ రిలీజ్ కావడం ఆలస్యమైంది. మొత్తానికి ఈ ఏడాది సిట్ మూవీని థియేటర్ రిలీజ్ ను స్కిప్ చేసి ఓటీటిలోకి దింపేశారు.

- Advertisement -

అరవింద్ కృష్ణ హీరోగా చేసిన సినిమాలు

అరవింద్ కృష్ణ యంగ్ ఇండియా అనే మూవీ తో హీరోగా అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ, రిషి, అడవి కాచిన వెన్నెల, బిస్కెట్ వంటి కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాలేమీ పెద్దగా ఆడలేదు. మరి సిట్ ఈ హీరోకు ఎంత వరకు గుర్తింపు నిస్తుందో చూడాలి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అరవింద్ సినిమాలు

ఇక హీరోగా సినిమాలు చేయడంతో పాటు అరవింద్ కృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నాడు అరవింద్ కృష్ణ ఇప్పటి దాకా ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపించాడు. ప్రస్తుతం అరవింద్ కృష్ణ ఏ మాస్టర్ పీస్ లో హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ హీరో కెరీర్ ను మలుపు తిప్పే సినిమా ఏది అవుతుందో చూడాలి. కాగా ఇప్పటిదాకా ఇంకా ఎవరయినా ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిట్ మూవీని చూడకపోతే జీ 5 ఓటీటీలో ఉంది ఈ వీకెండ్ ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు