Telugu Actress: అందుకే విడిపోయారు..స‌మంత బోల్డ్ సీన్స్ పై మాధ‌వీల‌త షాకింగ్ కామెంట్స్..!

న‌చ్చావులే, స్నేహితుడా లాంటి సినిమాల‌తో అభిమానుల‌ను సంపాదించుకున్న హీరోయిన్ మాధ‌వీల‌త‌. ఈ బ్యూటీ ఒక‌ప్పుడు సినిమాలు చేసి ప్ర‌స్తుతం పెద్ద‌గా ఆఫ‌ర్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఏదో ఒక ర‌కంగా త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంది. సినిమాల‌కు దూరం అయిన త‌ర‌వాత మాధ‌వీల‌త బీజేపీ కండువా క‌ప్పుకుని రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓవైపు మ‌హిళ‌లపై జ‌రుగుతున్న‌ అన్యాయాల గురించి మాట్లాడుతూ మ‌రోవైపు రాజ‌కీయాలపై కామెంట్లు చేస్తూ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స‌మంత నాగ‌చైత‌న్య విడాకుల గురించి మాట్లాడుతూ మ‌రోసారి వార్త‌ల్లో హెడ్ లైన్ గా మారింది.

చై సామ్ ల విడాకుల స‌మ‌యంలో వారి విడాకులకు ర‌క‌ర‌కాల కార‌ణాలు నెట్టింట ద‌ర్శ‌నం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ మంది స‌మంతదే త‌ప్పు అంటూ ఆమెపై విమ‌ర్శ‌లు కురిపించారు. సమంత అభిమానులు త‌ప్ప మిగితా నెటిజ‌న్లంతా నాగ‌చైత‌న్య‌కే స‌పోర్ట్ చేశారు. అంతే కాకుండా స‌మంత బోల్డ్ స‌న్నివేశాల‌లో న‌టించ‌డం వ‌ల్లే ఇద్ద‌రూ విడిపోయార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపైనే మాధ‌వీల‌త తాజా ఇంట‌ర్వ్యూలో స్పందించింది. విడాకుల త‌ర‌వాత స‌మంత‌నే అంద‌రూ నింధించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కానీ హీరో నాగ‌చైత‌న్య‌ను మాత్రం హీరోను చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వారిద్ద‌రూ విడిపోవ‌డానికి కార‌ణం ఎవ‌రికీ తెలియ‌దు కానీ స‌మంత‌పై మాత్రం దారుణ‌మైన కామెంట్లు చేశార‌ని చెప్పింది.

తాను కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చూశాన‌ని చెప్పింది. ఆ సిరీస్ లో బోల్డ్ స‌న్నివేశాల‌లో న‌టించ‌డం వ‌ల్ల‌నే చైతూ విడాకులు ఇచ్చాడ‌ని కామెంట్స్ చేశార‌ని కానీ అత‌డు కూడా న‌టుడే కాబ‌ట్టి అర్థం చేసుకుంటాడ‌ని చెప్పింది. ఆ సీన్ లు చాలా బాగున్నాయ‌ని..బ‌య‌ట జ‌నాలు ఎలా ఉన్నారో వారి బుద్ధి ఎలా ఉందో ఆ స‌న్నివేశాల‌లో చూపించార‌ని చెప్పింది. అందులో త‌న‌కు ఎలాంటి నెగిటివి క‌నపించ‌లేదని స‌మాజానికి మంచి మెసేజ్ ఇచ్చార‌ని పొగొడ్త‌లు కురిపించింది. స‌మంత‌ను బ్లేమ్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం మాధ‌వీల‌త చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దాంతో స‌మంత ఫ్యాన్స్ చాలా బాగా చెప్పారంటూ మాధ‌వీల‌త‌పై ప్ర‌శంలు కురిపిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు