Harish Jayaraj: సెంటిమెంట్ ఈసారైన బ్రేక్ అవుతుందా.?

త్రివిక్రమ్ రచయితగా, కరుణాకర్ దర్శకుడుగా, వెంకటేష్ హీరోగా చేసిన “వాసు” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్. హరీష్ జయరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన మెలోడీ మ్యూజిక్ తో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటాడు హరీష్. కొన్ని సందర్భాల్లో సినిమా ఫెయిల్ అయినా కూడా హరీష్ మ్యూజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అని చెప్పడం అతిశయోక్తి కాదు.

తమిళ్లో ఎన్నో హిట్ సినిమాలుకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. కానీ తెలుగులో చేసిన డైరెక్ట్ ఫిలిం మాత్రం ఏది హిట్ అవ్వలేదు. కానీ ఆ సినిమాతో హరీష్ రావాల్సిన మార్కులు మాత్రం హరీష్ సాధించుకున్నాడు. హరీష్ చేసిన సైనికుడు, మున్నా, ఆరంజ్, స్పైడర్ సినిమాలు తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి. కానీ ఆ సినిమాల్లో పాటలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకి ఫేవరెట్ ఆల్బమ్స్ అన్ని చెప్పొచ్చు.

ఇంకా ఆరంజ్ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. మగధీర సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. అప్పటికే ఆరెంజ్ సినిమా పాటలు ఆడియోన్స్ నర నరాల్లో ఇంకిపోయాయి. కానీ థియేటర్ కి వెళ్ళాక ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కానీ హరి జయరాజ్ మ్యూజిక్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. రీసెంట్ గా మళ్లీ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. పాట వచ్చిన ప్రతిసారి థియేటర్ని ఒక కన్సర్ట్ ఈవెంట్ లా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడారు. హరీష్ మ్యూజిక్ లో ఉన్న ఫ్రెష్ ఫీల్ కూడా అనుభవించారు యూత్.

- Advertisement -

హరీష్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న సినిమా “ఎక్స్ట్రా” ఆర్డినరీ మ్యాన్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ఈ సినిమాతోనైనా హరీష్ ఒక స్ట్రైట్ హిట్ ఫిలిమ్ ని తెలుగులో అందుకుంటాడో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు