Orange: మూడు రోజుల్లోనే ఇన్ని కోట్లా ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా తన బర్త్ డే కానుకగా మార్చి 25 న రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఆరెంజ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు. కానీ ఒక డిజాస్టర్ సినిమా రీ రిలీజ్ కావడం ఇదే తొలిసారి. ముందుగా చరణ్ బర్త్ డే కి అల్లు అరవింద్ మగధీర రిలీజ్ చేయాలనుకున్నా, నాగబాబు రిక్వెస్ట్ తో వెనక్కి తగ్గారు. ఆరెంజ్ సినిమాకి చాలా మంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగా ఇష్ట పడతారు. అందుకే ప్లాప్ అయినా కూడా ఫ్యాన్స్ డిమాండ్ తో ఈ సినిమాను రీ రిలీజ్ చేసారు.

అయితే రీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే రికార్డు వసూళ్లు సాధించిన ఈ సినిమా గురించి ఇంతకు ముందే “Filmify” లో చెప్పడం జరిగింది. మొదటి రోజే ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో అల్ టైం రికార్డు సృష్టించిన ఈ సినిమా 13/13 నాన్ స్టాప్ షో లతో 17 లక్షలు వసూలు చేసింది. నైజాం మొత్తం తొలి రోజు 75 లక్షల గ్రాస్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 1.53 కోట్లు వసూలు చేసింది.

కాగా తాజాగా మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు వచ్చాయి. ఆరెంజ్ సినిమా ఆంధ్ర, తెలంగాణ కలిపి మూడు రోజులకు గాను 2.12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాత నాగబాబు తెలిపారు. ఒకప్పుడు డిజాస్టర్ అయిన ఈ సినిమా రీ రిలీజ్ అయి సూపర్ హిట్ కలెక్షన్ల తో దూసుకుపోతుంది. ఈ సినిమా రీ రిలీజ్ తో వచ్చిన డబ్బులను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని నిర్మాత నాగబాబు చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు