Ravanasura: కామెడీ.. యాక్షన్ క్యారెక్టర్స్ తో రవితేజ

మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “రావణాసుర” ట్రైలర్ వచ్చేసింది. రవితేజ సుధీర్ వర్మ అనే దర్శకుడితో “రావణాసుర” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 28 సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ సినిమా యొక్క ఆఫిషియల్ ట్రైలర్ విడుదలైంది.

రవితేజ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే ఎంటర్టైన్ మెంట్ ఈ సినిమాలో కూడా ఉందని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఇందులో రవితేజ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ట్రైలర్ మొత్తం మామూలు కమర్షియల్ సినిమాలాగానే ఉన్నా లాస్ట్ రెండు డైలాగులతో అంచనాల్ని భారీగా పెంచేసింది ఈ సినిమా. అందులో “మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్”. మరొకటి “ఈ భూమ్మీద నన్నాపగలిగేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది నేనే”. ఈ రెండు డైలాగులు రవితేజ మార్క్ లో డిఫరెంట్ గా ఉన్నాయి. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది.

హర్షవర్షన్ రామేశ్వర్, భీమ్స్ ఇద్దరు కలిసి ఈ సినిమాకు సంగీతం అందించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. అను ఎమాన్యుయెల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్ లు హీరోయిన్లు గా నటించిగా హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. అలాగే జయరాం, రావు రమేష్, ఆది,సంపత్ రాజ్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న విడుదలవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు