Krishnamma: కృష్ణమ్మ మూవీ 3 డేస్ కలెక్షన్స్..!

Krishnamma: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో పోషించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ కృష్ణమ్మ. ఈ చిత్రం మే 10, 2024న వరల్డ్ వైడ్గా థియేటర్లలోకి వచ్చింది. వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అర్చన, కృష్ణ బురుగుల, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ మూవీ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మూవీ మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టగా మూడవ రోజు కూడా అదే జోరులో కొనసాగింది. ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 3.6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది.

 Lakshman meesa, Krishnamma movie box office, Krishnamma movie success.
Lakshman meesa, Krishnamma movie box office, Krishnamma movie success.

అరుణాచలం క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాల పాటి నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్టుగా నిలిచింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది ఈ మూవీ. దీంతో ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు