Kangana Ranaut net worth : కంగనా ఆస్తుల వెల్లడి… ఆమె దగ్గర ఎన్ని కిలోల బంగారం ఉందంటే?

Kangana Ranaut net worth : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఆస్తుల విలువెంతో బయటకు వచ్చింది. ఆమె వద్ద భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. నటికి చెందిన కార్ల విలువ అక్షరాలా 5.48 కోట్ల రూపాయలు. మరి ఆమె మొత్తం ఆస్తి ఎంత అనే వివరాల్లోకి వెళ్తే…

మండి నుంచి బరిలోకి దిగుతున్న కంగనా

బాలీవుడ్ నటి, నిర్మాత, దర్శకురాలు కంగనా రనౌత్ ఈసారి బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ గత కొన్నేళ్లుగా బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తూనే ఉన్నారు. కంగనా రనౌత్ తనను తాను నరేంద్ర మోడీ భక్తురాలిగా కూడా చెప్పుకుంటుంది. ఏదైతేనేం మొత్తానికి కంగనా బీజేపీ నుండి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు టిక్కెట్ దక్కించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేస్తున్నారు. ఈరోజు అంటే మే 14న కంగనా రనౌత్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. అలాగే తన ఆస్తి వివరాలను కూడా ప్రకటించింది.

కంగనాపై 8 కేసులు

ఇందిరా గాంధీపై సినిమా నిర్మిస్తున్న కంగనా రనౌత్.. తన ఆస్తినంతా అమ్మేసి ఈ సినిమా తీస్తున్నట్లు కొన్ని నెలల క్రితం చెప్పింది. అయితే ఈరోజు ఆమె సమర్పించిన అధికారిక ఆస్తి వివరాల్లో ఆయన అప్పుల కంటే 10 రెట్లు ఎక్కువ స్థిర ఆస్తులు, వారసత్వం ఉన్నట్లు తెలిసింది. 2022-23లో కంగనా 4.12 కోట్లు సంపాదించింది. 2021-22లో 12 కోట్ల ఆదాయం ఉంది. కంగనాపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వాటిలో పరువు నష్టం, మతాల మధ్య శత్రుత్వం పెంచే ప్రయత్నాలు, మతపరమైన మనోభావాలకు హాని కలిగించడం, మోసం వంటి కేసులు ఉన్నాయి.

- Advertisement -

50 ఎల్‌ఐసీ పాలసీలు

కంగనా వద్ద 2 లక్షల రూపాయల నగదు ఉంది. బ్యాంకుల్లో రెండు 2 కోట్ల రూపాయలున్నాయి. విశేషమేమిటంటే కంగనా 50 ఎల్‌ఐసీ పాలసీలు చేసింది. ఈ 50 ఎల్‌ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు. ఆమె తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టారు. కంగనా ఇతరులకు భారీ మొత్తాలను అప్పుగా ఇచ్చింది. తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులు ఆమె దగ్గర సుమారు 9.50 కోట్ల రూపాయలు అప్పు చేశారు.

ఎంత బంగారం ఉందంటే?

కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి. అందులో ఒకటి వెస్పా స్కూటర్. మిగతా మూడు వాహనాల మొత్తం విలువ రూ.5.48 కోట్లు. అవి అత్యంత ఖరీదైనవి, విలాసవంతమైనవి. కంగనా వద్ద 6.70 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 5 కోట్ల రూపాయలు. 3 కోట్ల విలువైన వజ్రాభరణాలు. 60 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వాటి విలువ 50 లక్షల రూపాయలు. కంగనా రనౌత్ మొత్తం వారసత్వ ఆస్తుల విలువ 28.73 కోట్లు.

అప్పులు కాదు ఆస్తులే ఎక్కువ

కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, చండీగఢ్‌లలో 6 కమర్షియల్ భవనాలు ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్ విలువ రూ.31.41 కోట్లు. ముంబైలో ఒకటి, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు. వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు. కమర్షియల్, రెసిడెన్షియల్ మొత్తం ఆస్తి విలువ రూ.62.98 కోట్లు. కంగనా రనౌత్ 15.58 కోట్ల రూపాయల అప్పులు చేసింది. నిర్మాణ సంస్థ అద్దె (లీజు) కోసం 1.80 కోట్ల రూపాయలు ఇచ్చారు. మొత్తంగా కంగనా నికర విలువ 154.57 కోట్ల రూపాయలు. కంగనా అప్పు 17.38 కోట్ల రూపాయలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు