Prasar Bharati OTT : ప్రభుత్వ ఓటిటి ప్లాట్ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే?

Prasar Bharati OTT : ప్రస్తుతం ఓటీటీలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ప్రభుత్వం కూడా సపరేట్ గా ఓటీటీ సంస్థను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఓటిటి ప్లాట్ఫామ్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరి ఆ ఓటిటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…

అప్పుడెప్పుడో దూరదర్శన్ ఛానల్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత దూరదర్శన్ తో పాటు మరిన్ని ప్రభుత్వ ఛానళ్ళు, ఆల్ ఇండియా రేడియో కూడా పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ అయిన ప్రసార భారతి కింద ప్రసారం అయ్యేవి. కానీ డిజిటల్ రంగంలో వస్తున్న ట్రెండ్ లకు దూరంగా ఉండడం వల్ల ప్రైవేట్ టీవీ ఛానళ్లకు దక్కిన ఆదరణ దూరదర్శన్ కు దూరమైంది. అయితే ప్రస్తుతానికి ఈ డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ప్రసార భారతి త్వరలోనే ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్రపంచమైన ఓటిటి ప్లాట్ ఫామ్ ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ప్రసార భారతి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో ఓటీటీ ప్లాట్ఫామ్ ను ప్రారంభించబోతుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆగస్ట్ లో లాంచ్ చేయడానికి శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిజానికి ప్రసార భారతి ఓటిటి ప్లాట్ ఫామ్ ను తీసుకురాబోతుందని కొంతకాలం క్రితమే సమాచారం అందింది. దీంతో అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయబోయే ఓటీటీ ఎప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతోందా అనే ఆసక్తి పెరిగిపోయింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కంటెంట్ ఎలా ఉంటుందంటే ?

సాధారణంగా ఓటీటీలు అనగానే అన్ని రకాల కంటెంట్ ప్రసారమవుతుంది. మరిది కేంద్ర ప్రభుత్వ ఓటీటీ సంస్థ కాబట్టి ఇందులో ఎలాంటి కంటెంట్ ఉండబోతోంది? అనే అనుమానాలు వ్యక్తమవడం మామూలే. అయితే దీనికి సమాధానం ఏమిటంటే ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేని కంటెంట్ ను మాత్రమే ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ ఓటిటిలో భారతదేశ విలువలు, సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేలా కంటెంట్ ఉండబోతుందని తెలుస్తోంది. కుటుంబమంతా కలిసి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూసే కంటెంట్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం కంటెంట్ ప్రొవైడర్ల లిస్టును కూడా ప్రసార భారతి బోర్డు ఆమోదించినట్టు తెలుస్తోంది. టెలివిజన్ కంటెంట్ ప్రొడక్షన్ హౌస్ అధికారి బ్రదర్స్, నిర్మాత దర్శకుడు వివుల్ శర్మతో మరి కొంతమంది ఈ లిస్ట్ లో ఉన్నారు.

- Advertisement -

సబ్స్క్రిప్షన్ ఫీజు ఎంతంటే?

మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఓటిటి ప్లాట్ఫామ్ కనీసం ఏడాది పాటు కంటెంట్ ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ యూజర్లు ఆ కంటెంట్ తో హ్యాపీగా ఉంటే ఆ తర్వాత అతి తక్కువ సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి అయితే ఆమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్స్టార్ వంటి ప్రైవేట్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఉండగా, ఈ మూడింటికి కూడా భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారు. మరి ప్రసార భారతి తీసుకురాబోయే ఓటీటీ ప్లాట్ఫామ్ ఎఫెక్ట్ వీటిపై ఏమైనా ఉంటుందా అనేది వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు