Krishnamma on OTT : సత్యదేవ్ క్రైమ్ రివేంజ్ డ్రామా ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోందంటే?

Krishnamma on OTT : సత్యదేవ్ హీరోగా నటించిన ఎమోషనల్ క్రైమ్ అండ్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ కృష్ణమ్మ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయం బయటకొచ్చింది. మరి కృష్ణమ్మ మూవీని ఏ ఓటిటిలో ఎప్పుడు చూడొచ్చు? అంటే…

యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన కృష్ణమ్మ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ మే 10న థియేటర్లలోకి వచ్చి మొదటి రోజే కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది సత్యదేవ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీకి మిక్స్డ్  రెస్పాన్స్ రావడం గమనార్హం. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ డిజిటల్ స్ట్రిమింగ్ ఎప్పుడు అని ఆరా తీయడం మొదలుపెట్టారు మూవీ లవర్స్.

కృష్ణమ్మ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కృష్ణమ్మ మూవీ ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ ఫాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక ఈ మూవీని థియేటర్ రిలీజ్ తర్వాత 30 రోజులకు డిజిటల్ ప్రీమియర్ చేసేలా ఆమెజాన్ ప్రైమ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టుగా టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కృష్ణమ్మ మూవీ జూన్ రెండో వారంలో ఓటీటీలో స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పరిస్థితుల్లోను బట్టి ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ మారే అవకాశం కూడా లేకపోలేదు. మేకర్స్ నుంచి అయితే ఇప్పటివరకు కృష్ణమ్మ మూవీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఓటిటిలో కృష్ణమ్మ రాబోయే రెండు మూడు రోజుల ముందే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.

కృష్ణమ్మ స్టోరీ… ఈ మూవీ స్టోరీ మొత్తం ముగ్గురు స్నేహితుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చేయని నేరాలను ఒప్పుకుని జైలుకు వెళ్లే ఆ ముగ్గురి జీవితం ఓ సంఘటన కారణంగా ఎలాంటి మలుపు తిరిగింది? అనేది ప్రధాన అంశం.

సత్యదేవ్ సినిమాల విషయానికి వస్తే… సత్యదేవ్ మెయిన్ హీరో కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ముందుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన ఈ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్, రాగల 24 గంటల్లో, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, 47 డేస్, తిమ్మరుసు, స్కైలాబ్ లాంటి సినిమాలు చేసి తనకంటూ హీరోగా ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవికి మెయిన్ విలన్ గా నటించి అదరగొట్టాడు. అలాగే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రామసేతు సినిమాలో ఓ పాత్రలో నటించి హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గాడ్సే, గుర్తుందా సీతాకాలం సినిమాలతో ఆకట్టుకున్నాడు సత్యదేవ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు