GangsOfGodavari : గోల్డెన్ వీక్ మిస్ అయిన విశ్వక్ సేన్..

GangsOfGodavari : టాలీవుడ్ లో గత రెండు నెలల నుండి సరైన సినిమాలు రిలీజ్ కావడం లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో వచ్చిన టిల్లు స్క్వేర్ తర్వాత మళ్ళీ క్లీన్ హిట్ టాలీవుడ్ లో రాలేదు. ఓ రెండు సినిమాలు హిట్ అయినా అవి డబ్బింగ్ సినిమాలే. అవికూడా వచ్చిన నెల దాటింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ కరువు మీదున్నారు. మంచి కథాబలం ఉన్న సినిమా వస్తే, ఎంత చిన్న సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా సరే మూవీ లవర్స్ ఎగబడివెళ్లిపోతారు. కానీ దర్శక నిర్మాతలు ఒక్కరూ ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. దీనికి కారణం ఎన్నికల హడావుడి ఒక విషయం అయితే, మరొకటి ఐపీఎల్ మ్యాచ్ ల ఎఫెక్ట్. అన్నిటికి మించి సమ్మర్ లో ఎండల ప్రభావం. ఇక కారణాలు ఏమైనా టాలీవుడ్ లో ఈ నెలలో వచ్చే మంచి క్రేజీ సినిమాలు కూడా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నాయి. మిగతా సినిమాల సంగతి పక్కన బెడితే, గ్యాంగ్స్ అఫ్ గోదావరి మే 17 నుంచి వాయిదా వేసుకుని మే 31 వెళ్లిపోవడం మంచి నిర్ణయం కాదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

గోల్డెన్ వీక్ మిస్ అయిన విశ్వక్ సేన్..

ఇక అన్ని కుదిరితే ఈ వారమే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే కారణంతో వాయిదా వేశారు. కానీ విశ్వక్ సేన్ మంచి గోల్డెన్ వీక్ ని మిస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల హడావిడి పూర్తయిన తరుణంలో జనాలు మెల్లగా సినిమాల వైపు తొంగి చూస్తారు. నిన్నటిదాకా ప్రచారాలు, ఓట్ల దందాలు, డబ్బు పంపకాలు, ప్రయాణాలు, టీవీలో వార్తల విశ్లేషణలు, మిత్రులతో చర్చలు ఇలా బోలెడు సమయం ఎలక్షన్ల కోసమే కేటయించి అలిసిపోయారు. ఇప్పుడు అత్యవసరంగా వినోదం కావాలి. సగటు తెలుగు వాడు ముందుగా పెట్టుకునే ఆప్షన్ థియేటర్. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఈ వారం రిలీజ్ అయిన కృష్ణమ్మ, ప్రతినిధి లాస్ట్ వీక్ వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సహా అన్ని సినిమాలు ఆల్రెడీ సైలెంట్ అయిపోయాయి. వీటి కన్నా ఏ సెంటర్స్ లో హాలీవుడ్ మూవీ ది కింగ్ డం అఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మెరుగైన ఆక్యుపెన్సీలు చూపిస్తోంది. ఒకవేళ గ్యాంగ్స్ అఫ్ గోదావరి కనక ఈ శుక్రవారమే వచ్చి ఉంటే భారీ ఓపెనింగ్స్ దక్కేవని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.

Vishwak sen Gangs of Godavari movie missed a good golden week

- Advertisement -

పోటీపడనున్న విశ్వక్ మూవీ..

ఏది ఏమైనా విశ్వక్ సేన్ మంచి వీక్ ని మిస్ అయ్యాడని చెప్పాలి. అయినా ఎప్పుడో డిసెంబర్ నుంచి అనుకుంటున్న సినిమా(GangsOfGodavari) ఇప్పుడు మే కి వచ్చినా కూడా ఇంకా సిద్ధంగా లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా మే 31 పోటీ ఎక్కువగా ఉంది. ముందే ఈ డేట్ కి ప్రకటించుకున్న హరోం హర, మ్యూజిక్ షాప్ మూర్తి, గం గం గణేశా, సత్యభామ, భజే వాయు వేగం సినిమాల్లో ఏవి తప్పుకున్నట్టు లేదా వాయిదా పడినట్టు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఒకటి రెండు అవ్వొచ్చు కానీ సోలోగా పండగ చేసుకోవాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఇప్పుడు పోటీలో రిలీజ్ కావాల్సి వస్తుంది. మరి ఆ డేట్ కి అయినా ఖచ్చితంగా వస్తారా లేదా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు