Dilraju : కమర్షియాలిటీ ని వదిలి దెయ్యం కథలని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది..

Dilraju : టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఉన్న దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే చాలు ఒకప్పుడు మినిమం గ్యారెంటీ సినిమా అనేవారు. కానీ గత కొంతకాలంగా మాత్రం దిల్ రాజు నుండి సరైన సినిమా రావడం లేదు. ఎలాంటి సినిమా చేసినా ప్లాప్ అవుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఎంత డిజాస్టర్ అయిందో తెలిసిందే. అయితే దిల్ రాజు ఎలాంటి సినిమా చేసినా కూడా పక్కా ప్రణాళికతో ఫినిష్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలకు బడ్జెట్ లు ఊహించిన విధంగా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. అయినప్పటికీ సినిమాను మంచి కంటెంట్ తో విడుదల చేయాలి అని అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి నటిస్తున్న “లవ్ మీ” సినిమాపైనే పెట్టాడు.

“లవ్ మీ” పైనే దిల్ రాజు ఫోకస్..

ఇక ఈ క్రమంలో ఆశిష్ రెడ్డి సినిమా పై ఎలాంటి లిమిట్స్ లేకుండా దిల్ రాజు ఖర్చు చేస్తున్న విధానం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఆశిష్ రెడ్డి మొదటి సినిమా రౌడీ బాయ్స్ కోసమే ఆయన భారీగా ఖర్చు చేశారు. అయితే ఆ సినిమా అంచనాలు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక లవ్ మీ సినిమా ప్రస్తుత ట్రెండుకు తగ్గట్టుగా ఒక డిఫరెంట్ హారర్ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుత కాలంలో హారర్ సినిమాలు క్లిక్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక అందుకే దిల్ రాజు ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సినిమాను మే 25వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమా కోసం దాదాపు 18 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్. ఎంత హారర్ సినిమా అయినా, చిన్న సినిమా కాబట్టి, దిల్ రాజు ప్లాపుల్లో ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఇలాంటి దెయ్యం సినిమాకు బడ్జెట్ ఎక్కువ అని నెటిజన్లు భావిస్తున్నారు.

Dil Raju is spending a whopping 20 crores for the movie "Love Me".

- Advertisement -

కమర్షియల్ ని వదిలి దెయ్యం కథల్ని నమ్మాల్సిన పరిస్థితి..

అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో దిల్ రాజు (Dilraju) జడ్జిమెంట్ కి మంచి వ్యాల్యూ ఉండేది. ఈయన ఏదైనా సినిమా గురించి మాట్లాడితే ఆ సినిమా మినిమం హిట్ అని నమ్మేవారు జనాలు. పైగా డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా దిల్ రాజు ముందుగా సినిమా చూసి, దాని రిజల్ట్ ని ముందే ఊహించి ప్రమోషన్ చేస్తారు. ఒకవేళ ఏ సినిమా అయినా అంతంత మాత్రంగా ఉంటే, తన ప్రమోషన్ మ్యాజిక్ తో దిల్ రాజు సినిమాని ఆర్హికంగా గట్టెక్కించడంలో నిష్ణాతుడు. ఏది ఏమైనా ఇప్పుడు కమర్షియల్ సినిమాలతో ఊపు ఊపిన నిర్మాత దెయ్యం కథలని నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక లవ్ మీ సినిమా కు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక మరి లవ్ మీ సినిమా తో అయినా దిల్ రాజు కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు