OTT Movie : లియోని ఎవరు చంపారు? కామెడీ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్… హంతకుడెవరో చివరిదాకా ఊహించలేరు

OTT Movie : లియోని ఎవరు చంపారు? హంతకుడెవరో చివరిదాకా ఊహించలేరు. అది తెలియాలంటే కామెడీ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మర్డర్ ముబారక్ ను చూడాల్సిందే.

మర్డర్ ముబారక్ ఒక క్లాసిక్ కామెడీ, కలర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, పంకజ్ త్రిపాఠి, కరిష్మా కపూర్, డింపుల్ కపాడియాతో పాటు ఇతర బాలీవుడ్ నటినటులు నటించారు.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ 2.30 గంటలు ఉంటుంది. ఈ మూవీని తెలుగు, తమిళంతో సహా పలు భాషల్లోకి డబ్ చేశారు. సినిమా మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు హంతకుడు ఎవరు? అనేది కనిపెట్టడం కష్టమే. మర్డర్ ముబారక్ అనేది క్రైమ్ థ్రిల్లర్ స్టైల్‌లో తెరకెక్కగా, అందరి మదిలో మెదులుతున్న ఆ ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానాన్ని కనుగొంటారు.

- Advertisement -

మర్డర్ ముబారక్ కథ

లియోను సాంప్రదాయ ఢిల్లీ క్లబ్, రాయల్ ఢిల్లీ క్లబ్‌లో హత్య చేస్తారు. వారు అతని హత్యను యాక్సిడెంట్‌గా సెట్ చేసి పోలీసులకు కాల్ చేస్తారు. అయితే ACP పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి అక్కడ జరిగింది ప్రమాదం కాదని, హత్య అని చాలా ఫన్నీ, కామెడీ వేలో ఇన్వెస్టిగేట్ చేసి కనుగొంటాడు. అంతలోపు వచ్చే ట్విస్ట్ లు, ఫన్నీ సీన్స్ బాగుంటాయి.

రాయల్ ఢిల్లీ క్లబ్

కరిష్మా కపూర్ ఈ చిత్రంలో సినీ నటిగా నటించింది. తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ న్యాయవాది కాగా, సారా అలీఖాన్ బాంబిగా నటించారు. డింపుల్ కపాడియా విగ్రహం మేకర్ పాత్రను పోషిస్తోంది. అలాగే చాలా మంది ప్రముఖులు రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ధనవంతుల పాత్రలు పోషించారు. డిటెక్టివ్ సాంబుగా పంకజ్ త్రిపాఠి ఈ హత్య కేసును డీల్ చేసిన తీరు అభిమానులను ఆకర్షిస్తుంది.

లియోని చంపిందెవరు?

ఈ చిత్రంలో లియో ఎవరు ? అతన్ని ఎవరు చంపారు అనే ప్రశ్నతో సినిమా నడుస్తుంది.  రాజకుటుంబానికి చెందిన సేవకుడి నుండి రాజు వరకు దొంగ పోలీస్ గేమ్‌ లాగా ప్రతి ఒక్కరినీ ఇంటరాగేట్ చేస్తారు పోలీసులు. ప్రతి ఒక్కరూ ఈ కేసులో అనుమానితులుగానే ఉంటారు. చనిపోయిన లియో బలహీనత తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశాడంటూ బయటకొచ్చే అందరి అంతర్గత వ్యవహారాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇలా చాలా విషయాలు మిస్టరీలుగా బయట పడతాయి.

ప్రేమ కోసమే హత్య

క్లైమాక్స్‌లో ఇది ప్రేమ కోసం జరిగిన హత్య అని తేలుతుంది. హంతకుడెవరో, ఏం తేలిందో తెలుసుకోవడానికి సాక్ష్యంగా తేలిన ప్రతి విషయాన్ని సరికొత్తగా, తెలివిగా స్క్రిప్ట్‌లో రాసి తెలియజేసిన తీరు అభిమానులను ఈ ఓటీటీ చిత్రం ఆకట్టుకోవడానికి మెయిన్ రీజన్. డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే ఈ ఏడాది బాలీవుడ్ లో మరో హిట్ సినిమా వచ్చి ఉండేదని అంటున్నారు. లియోని ఎవరు చంపారో తెలుసుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి. కొన్ని అడల్ట్ సీన్స్ మాత్రం ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు