Gopichand: “భీముడి”గా బాక్స్ ఆఫీస్ కి తన ప్రతాపం చూపించాల్సిన టైమొచ్చింది

మ్యాచో స్టార్ గోపీచంద్ ఇప్పుడు కసి మీదున్నాడు. తన గత చిత్రాలతో మార్కెట్ ని కూడా తక్కువ చేసుకున్న ఈ హీరోకి ఇప్పుడు ఒక సాలిడ్ కమ్ బ్యాక్ హిట్టు పడాలి. అందుకే తనకి అచ్చోచిన జోనర్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ సినిమా వస్తుందని “filmify” లో ఇంతకు ముందే చెప్పడం జరిగింది.

తాజాగా ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. గోపీచంద్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఆ పోస్టర్ సాలిడ్ ఇంపాక్ట్ ని ఇచ్చింది. గోపీచంద్ అభిమానులు తనని ఎలాంటి రోల్ లో అయితే చూడాలనుకున్నారో అలాంటి పాత్రతో వస్తున్నారు. “భీమా” అన్న టైటిల్ తో విడుదలైన ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో గోపిచంద్ కోర మీసం ఉన్న రగ్గడ్ లుక్ తో ఊర మాస్ గా ఉన్నాడు. ఆ స్టిల్ లో కోపంతో ఉగ్రంగా చూస్తున్న గోపీచంద్ పోలీస్ షర్ట్ లో ఉండటం విశేషం. దీన్ని బట్టి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నాడని అర్థం అవుతుంది.

ఇంతకు ముందు గోపీచంద్ పోలీస్ పాత్రలు చేసిన సినిమాలన్నీ హిట్టే. తన గత చిత్రాలైన ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ లాంటి చిత్రాల్లో పోలీస్ పాత్రల్లో పవర్ఫుల్ గా నటించి మెప్పించాడు. ఆ చిత్రాలు ఏ రేంజ్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో మళ్ళీ పోలీస్ పాత్రతో రానుండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.

- Advertisement -

ఇక రిలీజ్ అయిన పోస్టర్ లో హీరో వెనకాల కొమ్ముల్తో ఉన్న ఎద్దుని చూపించడం జరిగింది. విలన్ ల అంతు చూడ్డానికి పొగరుతో రంకెలేస్తున్న హీరో అని సింబాలిక్ గా చిత్రం పెట్టుంటారా? లేదా ఎద్దుకి కూడా సినిమాలో ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా? అనేది తెలియాలి. ఏది ఏమైనా “భీమా” చిత్రంతో గోపీచంద్ అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చి సాలిడ్ బ్లాక్ బస్టర్ తో కమ్ బ్యాక్ హిట్ ఇస్తాడని విడుదలైన పోస్టర్ ని బట్టి నమ్మకంగా చెప్పవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు