NBK109 : రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య ! ఈ వయసులో అంత అంటే కష్టమే..

అఖండ, వీరసింహరెడ్డి సినిమాలతో హిట్ ట్రాక్ మీద ఉన్న బాలయ్య తన నెక్స్ట్ కోసం రెమ్యునరేషన్ పెంచాడనే టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దీ సంవత్సరాలుగా రెమ్యునరేషన్ ని పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ పోయిన బాలయ్య, సడన్ రెమ్యునరేషన్ హైక్ చేసి, ప్రొడ్యూసర్స్ కి షాక్ ఇచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెల్సిందే. ఇటీవలనే బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసారు. తెలంగాణ యాసలో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. టీజర్ అప్లోడ్ చేసిన కొద్దీ సేపట్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ తో బాలయ్య బాబు కెరీర్ లోనే వన్ అఫ్ ది హైయెస్ట్ వ్యూడ్ టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే ఈ సినిమా దసరా కానుకగాప్రేక్షకుల ముందుకి రానుంది.

భగవంత్ కేసరి సినిమా తరువాత బాలకృష్ణ, బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని సితార ఎంటెర్టైనమెంట్స్ పై నాగ వంశి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి గాను బాలకృష్ణ 25cr రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్.

- Advertisement -

వీరసింహారెడ్డి సినిమాకి గాను 15 కోట్ల పారితోషికం అందుకున్న బాలయ్య, ఇక నుంచి తాను చేయబోయే అన్ని సినిమాలకు 25cr డిమాండ్ చేయబోతున్నాడట. అయితే బాలకృష్ణ సినిమా అంటేనే బడ్జెట్ చాలా వరకు అవుతుంది. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ రెమ్యునరేషన్ కూడా పెంచేసరికి నిర్మాతలకు తలపోటుగా మారింది. దానికి తోడు బాలకృష్ణ సినిమా కాస్తో, కూస్తో బాగుంటే కలెక్షన్స్ కి డోకా ఉండదు. కానీ కొంచెం తేడా కొట్టిన సినిమాని పట్టించుకునే వాళ్లుండరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య అడిగినంత రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్స్ ఇస్తారో లేక బేరాలాడతారో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు