#AAtakesoverAha: ఇంత హైప్ దేనికి? – ఈ సస్పెన్స్ ఎందుకు..?

ఇటీవల ఆహా అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రొడక్షన్ నంబర్ 1 పేరుతో #AAtakesoverAha అనే హ్యాష్ ట్యాగ్ తో రిలీజ్ చేసిన పోస్టర్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసున్న ఫోటోతో ఆ ప్రాజెక్ట్ పై సస్పెన్స్ మరింత పెరిగింది. ఇద్దరు కలిశారు మళ్లీ, ఇక రికార్డుల వేట మొదలు అంటూ రిలీజ్ చేసిన ఆ ఫోటో వైరల్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఏమీ అనౌన్స్ చేయకపోవడంతో నెటిజన్లు ఎవరి ఊహాగానాలు వారు రచిస్తున్నారు. కొంతమంది ఇది ఆహా లో అల్లు అర్జున్ చేస్తున్న వెబ్ సిరీస్ కోసమని అంటుంటే మరికొంత మంది అల్లు అర్జున్ ఆహా కోసం ప్రొడ్యూస్ చేస్తున్న షో అని అంటున్నారు. గతంలో అల్లు అర్జున్, శ్రీలీల, త్రివిక్రమ్ కలిసి దిగిన ఫోటోలో కాస్ట్యూమ్స్, ఇప్పుడు వైరల్ అయిన ఫోటోలో కాస్ట్యూమ్స్ ఒకటే కావటంతో నెటిజన్ల కన్ఫ్యూజన్ ఇంకా పెరిగింది.

కనీసం ఒక చిన్న హింట్ కూడా ఎక్కడ దొరక్కపోవటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఏమయ్యుంటుందా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. మరో పక్కన అన్ స్టాపబుల్ తరహాలో అల్లు అర్జున్ తో ఇంకో షో ఏమైనా ప్లాన్ చేశాడా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఒక వేళ షో ప్లాన్ చేసిన మాట నిజమే అయితే, ఆ మాత్రం దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయడం అవసరమా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఒక్క అనౌన్సమెంట్ తో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇటు సోషల్ మీడియాలో తన పేరు ట్రెండ్ అయ్యేలా చేశాడు. పుష్ప2 అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు ఈ సర్ప్రైజ్ ఆసక్తిని పెంచుతోంది.

ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ రివీల్ చేయకుండా సస్పెన్స్ క్రియేట్ చేసిన ఆహా టీం పై కొంతమంది ఫైర్ అవుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకొని, ఇప్పుడు పుష్ప2, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమాను లైన్లో పెట్టిన టైమ్ లో ఇప్పుడు వెబ్ సిరీస్, షో అంటూ డీవియేట్ చేయటం వల్ల సినిమాలు ఆలస్యం అవ్వటం తప్పించి ఎటువంటి ఉపయోగం లేదని అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే, ఒటీటీలో అల్లు అర్జున్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ గనక వర్కౌట్ అయితే, ఇతర స్టార్ హీరోలు కూడా బన్నీ బాట పట్టే అవకాశం ఉంది. మరి, ఈ సస్పెన్స్ కి తెర దించేది ఎప్పుడో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు