NTR31: విలన్ ఎవరో తెలిస్తే మతి పోతుంది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి తరచూ ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించనుందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా వినిపిస్తున్న మరో అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అదేంటంటే, ఈ సినిమాలో విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ను విలన్ రోల్ కోసం సంప్రదించే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నాడని అంటున్నారు. ఇదే గనక నిజం అయితే, సినిమాకు హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఐశ్వర్య ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి మెప్పించటంతో ప్రశాంత్ నీల్ ఈ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అన్ని సవ్యంగా జరిగి ఐశ్వర్య రాయ్ ఈ ప్రాజెక్ట్ లో గనక నటిస్తే, ఈ సినిమా తర్వాత ఇమేజ్ మారిపోయే అవకాశం ఉంది. ఇండియన్ సినిమాల్లో లేడీ విలన్స్ అన్నది కాస్త అరుదనే చెప్పాలి, ఐశ్వర్య లాంటి స్టార్ హీరోయిన్ నెగిటివ్ రోల్స్ కంటిన్యూ చేస్తే గనక ఈ ట్రెండ్ పెరిగే అవకాశం ఉంది.

ఈ మధ్య సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఐశ్వర్య పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ కి కమిట్ కాలేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ 31 సినిమాలో నెగిటివ్ రోల్ ని యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ జనాలు టాలీవుడ్ టెక్నీషియన్స్ తో పని చేయటానికి ఆసక్తి చూపుతున్న క్రమంలో ఇప్పటికే కేజిఎఫ్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్, RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే క్రియేట్ అయిన హైప్ కి ఇప్పుడు ఈ న్యూస్ మరింత హైప్ పెంచుతోంది. మరి, రోజుకో అప్డేట్ వినిపిస్తూ హైప్ పెంచుతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు