VD12: ఫ్లాప్ హీరో, ఫ్లాప్ హీరోయిన్ – ఈసారైనా హిట్ దక్కేనా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ నుండి విజయ్ ఇంకా బయటపడలేకపోతున్నాడు, జనగణమన సినిమా అటకెక్కటానికి కూడా అదే ఎఫెక్ట్ కారణం. ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విజయ్ ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. అయితే, ఈ సినిమా కోసం విజయ్ పూజ హెగ్డేని రికమెండ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలే ఫ్లాప్స్ లో ఉన్న విజయ్, గత కొంత  కాలంగా వరుస ఫ్లాప్స్ ఇచ్చిన పూజని రికమెండ్ చేయటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.

ఆచార్యతో మొదలైన పూజ డిజాస్టర్స్ పరంపర ఇటీవల వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ వరకు కొనసాగింది. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా మినహా వేరే సినిమాలు పూజ లైనప్ లో లేవు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతవరకు షూటింగ్ జరిగి ఆగిపోయిన జనగణమన సినిమాలో కూడా పూజనే హీరోయిన్. మరి ఆ సెంటిమెంట్ ని కూడా పట్టించుకోకుండా విజయ్ పూజ హెగ్డేని తన నెక్స్ట్ సినిమాలోకి తీసుకోవాలని అనుకుంటున్నాడంటే ఎదో బలమైన కారణం ఉండే ఉంటుందన్నది కొందరి అభిప్రాయం.

విజయ్, సమంత నటించిన ఖుషి సినిమా ఈ సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధమవుతోంది. అటు సమంత, ఇటు విజయ్ ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్న నేపథ్యంలో ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని లిరికల్ సాంగ్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి విజయ్, పూజల కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్తుందా లేదా, ఇద్దరికీ హిట్ తప్పనిసరి అయిన పరిస్థితిలో హిట్ దక్కుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు