Eagle: ‘నా చూపే మరణం’ అంటున్న మాస్ మహారాజ..!

మాస్ మహారాజ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్స్ మీడియా బ్యానర్ పై రూపొందుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. సోషల్ మీడియాలో ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఈ సినిమాకు ఈగల్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది సినిమా యూనిట్. టాప్ క్లాస్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అవసరాల శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మధుబాల ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ టీజర్లో గ్యాంగ్స్టర్ గెటప్ లో ‘ఆ చూపే మరణం’ అన్న బీజీఎమ్ తో రవితేజ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. రాబిన్ హుడ్ తరహా స్టోరీ ఛాయలు కనిపిస్తున్న ఈ టీజర్ చుస్తే రవితేజ క్యారెక్టర్ కి మల్టిపుల్ షేడ్స్ ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇటీవల రావణాసుర సినిమాతో డిజాస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తుతం స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు కథ ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న విడుదల కానుండగా, ‘ఈగల్’ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది పీపుల్స్ మీడియా సంస్థ. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రవితేజ కెరీర్లో 73వ సినిమాగా వస్తోంది.

రావణాసుర డిజాస్టర్ అయిన ఎఫెక్ట్ ఏ మాత్రం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న రవితేజ లైనప్ లో ఉన్న నెక్స్ట్ మూవీస్ అన్ని ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఏ సినిమా రవితేజ కెరీర్ కి కీలకంగా మారింది. ఈ మధ్య ఒక హిట్ వస్తే, రెండు ఫ్లాప్స్ తో వెనకబడిన రవితేజ ఇకనైనా వరుస హిట్స్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు