Allari Naresh : డబ్బువస్తుందనుకొనే నిర్మాత డబ్బు పెడతాడు.. లేకపోతే ఎందుకు? – అల్లరి నరేష్

Allari Naresh : టాలీవుడ్ లో ఒకప్పుడు కామెడీ కి కేరాఫ్ గా సినిమాలు తీసే ఏకైక హీరోగా అల్లరి నరేష్ ఉండేవాడు. కానీ గత కొంతకాలంగా ఆయన సరైన సక్సెస్ లేక ఫామ్ కోల్పోయాడు. ఆ మధ్య నాంది తో కం బ్యాక్ ఇచ్చినా, మళ్ళీ ప్లాప్ లు అందుకున్నాడు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ ఈ.వీ.వీ స‌త్య‌న్నారాయ‌ణ వార‌సుడిగా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన అల్లరి న‌రేష్, త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న న‌టుడు. ఇక కామెడీ హీరోగా సక్సెస్ అయిన నాంది అప్పుడప్పుడూ స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌తోపాటు యాక్ష‌న్ త‌ర‌హా రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక తాజాగా ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’ అనే సినిమా చేసిన నరేష్, త్వ‌ర‌లో ఆ సినిమాతో ప్రేక్ష‌కు ల‌ముందుకు రానున్నాడు. ఈ స‌ద‌ర్భంగా న‌రేష్ ఇండ‌స్ట్రీ..స‌క్సెస్ ఫెయ‌ల్యూర్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. నరేష్ మాట్లాడుతూ ఇండ‌స్ట్రీలో లైఫ్ ని డిసైడ్ చేసేది కేవ‌లం హిట్ మాత్ర‌మే. విజ‌యం ఉంటే ఇంటి ముందు మ‌న కోసం ఎన్ని కార్లు అయినా ఉంటాయి. స‌క్సెస్, ఫేం, ఫాలోయింగ్ ఉంటేనే అవ‌కాశాలు వ‌స్తాయి. ఎంత‌మంది నిర్మాత‌లైనా లైన్ లో ఉంటారు. అదే లేక‌పోతే ఎవ‌రూ ఉండ‌రు. అదే ఇండ‌స్ట్రీ అని అన్నారు.

డబ్బు రాదంటే ఎవరూ పెట్టరు..

అలాగే ప్లాప్ సినిమాలంటే త‌ప్పుగా చూడాల్సిన ప‌నిలేదు. ప్లాప్ ల్లో ఉన్న హీరోపైనా, ద‌ర్శ‌కుడిపైనా నిర్మాత ఎందుకు డ‌బ్బులు పెడ‌తాడు. అలా పెడితే అత‌డు పోతాడు క‌దా. మ‌న వ‌ల్ల ఒక‌రికి డ‌బ్బులొస్తున్నాయంటే మ‌రొక‌డు పెడ‌తాడు. అంతే గానీ రూపాయి పెడితే దమ్మిడి రాద‌నుకున్న‌ప్పుడ అత‌నెందుకు పెడ‌తాడు. ఇండ‌స్ట్రీలో యాటిడ్యూడ్ గా, యారోగెంట్ గా ఉంటే అవ‌త‌లి వైపు నుంచి రియాక్ష‌న్ కూడా అలాగే ఉంటుంది. విజ‌యాలున‌ప్పుడు విర్ర‌వీగ‌కూడ‌దు. ప్లాప్ లున్న‌ప్పుడు మూల‌న కూర్చుని ఏడవ కూడ‌ద‌ని నాన్న చెప్పారని నరేష్ అన్నారు. అలాగే తాను కూడా అదే పాలో అవుతున్నానని, హిట్లు..పాప్ లు నాకు స‌మాన‌మేనని, ఇండ‌స్ట్రీలో నాన్న గారిపై ఎలాంటి వివాదాలుగానీ, విమ‌ర్శ‌లు గానీ లేవని, ఆయ‌న పూర్తిగా నాన్ కాంట్ర‌వ‌ర్శియ‌ల్ ప‌ర్స‌న్ అని, ఆయ‌న చెప్పిందే నేను పాటిస్తున్నానని, అన్నారు.

మే 3న ఆ ఒక్కటి అడక్కు..

ఇక అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ మే 3 న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉండగా, అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత నటించిన కామెడీ డ్రామా అవడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ కి ఇది మంచి హిట్ తెచ్చి పెట్టొచ్చని అనిపిస్తుంది. ఇక అల్లరి నరేష్ ఈ సినిమాలో పెళ్లికాని యువకుడిగా, పిల్ల కోసం ఎదురుచూస్తున్న కుర్రాడిగా కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతోనైనా అల్లరి నరేష్ సక్సెస్ కొట్టి మంచి కం బ్యాక్ ఇచ్చి మునుపటి లా బిజీ అవుతాడా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు